ప్రస్తుత కాలంలో కొందరు మద్యానికి బానిసలై క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తమ కుటుంబాల్లోతీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.అయితే తాజాగా ఓ వ్యక్తి మద్యానికి బానిసై మద్యం లేకుండా ఉండలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన టువంటి కొడంగల్ పట్టణ పరిసర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఈ వ్యక్తి కుటుంబ పోషణ నిమిత్తమై రోజువారి కూలి పనులు చేస్తూ ఉండేవాడు.
దీంతో ఒళ్ళు నొప్పుల బాధలు భరించలేక తరచు మద్యం సేవించే వాడు.అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని ప్రకటించడంతో గత పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి.
దీంతో తరచూ మద్యం సేవించే వ్యక్తికి ఒక్కసారిగా మద్యం దొరకకపోవడంతో విచక్షణ కోల్పోయాడు.అంతేగాక గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
ఇది గమనించినటువంటి కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.బాధితుడిని చికిత్స నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్నపోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.అయితే ఇలా జరగడం తెలంగాణ రాష్ట్రంలో రెండవ సారి.
ఇప్పటికే ఓ వ్యక్తి మద్యం దొరకడంలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.దీంతో కొందరు మందుబాబులు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి మద్యం దుకాణాలను రోజులో కనీసం కొంత సమయం పాటు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.