అమెరికాలో వింత...ఆ వయస్సులో ఆమెకి బిడ్డ పుట్టడం సంచలనమే....  

50-year-old Grandma Gives Birth After Surprise Pregnancy-florida,michele Hall,surprise Pregnancy

అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన మిషెల్ హాల్ అనే మహిళ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చి సంచలనం సృష్టించింది. అదేంటి మహిళ బిడ్డకి జన్మని ఇవ్వడం షాకింగ్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా.?? అసలు విషయం ఏమిటంటే.ఆమె వయసు 50 ఏళ్ళు, ఆమెకు నలుగురు పిల్లలు, ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు...

అమెరికాలో వింత...ఆ వయస్సులో ఆమెకి బిడ్డ పుట్టడం సంచలనమే....-50-Year-Old Grandma Gives Birth After Surprise Pregnancy

ఈ వయసులో కూడా ఆమె ఓ బిడ్డకి జనమనివ్వడం ఆశ్చర్యమే, అసలు విషయం ఏమిటంటే, అది కూడా ఆమె మోనోపాజ్ దశలో ఉందని వైద్యులు చెప్పినా సరే ఆమె గర్భం దాల్చడం విశేషం.

ఇదిలాఉంటే సుమారు ఐదు నెలల క్రితం తనకి కడుపు నొప్పి ఉందని ఆమె వైద్యులని సంప్రదించింది.

అనుమానంతో ఆమె గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా. అప్పటికే ఆమె గర్భవతి అని తేలడంతో ఆమె తో పాటు ఆమె కుటుంభ సభ్యులు , భర్త షాక్ అయ్యారు. అయితే ఈ వయసులో బిడ్డ పుడితే ఆరోగ్యవంతంగా ఉంటాడో లేదో అని సందేహించిన వైద్యులకి షాక్ ఇస్తూ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా పుట్టాడు.