దేశాన్ని వణికిస్తున్న కరోనా, ఒక్కరోజే 50 వేలకు పైగా…  

India records more than 50 thousand cases in a single day , India, Corona Cases, Corona Deaths, Coronavirus in India - Telugu Corona Cases, Corona Deaths, Coronavirus In India, India, India Records More Than 50 Thousand Cases In A Single Day

దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది.రోజు రోజుకు దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నాయి.

 50 Thousand Corona Cases India

రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం ఒక్కరోజే ఏకంగా 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 853 గా ఉంది.

గడచినా 24 గంటల్లో ఇంత భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.ఒకపక్క రికవరీ రేటు ఎక్కువగానే ఉన్నప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుండటం గమనార్హం.

దేశాన్ని వణికిస్తున్న కరోనా, ఒక్కరోజే 50 వేలకు పైగా…-General-Telugu-Telugu Tollywood Photo Image

తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 17 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్ర,తమిళనాడు రాష్ట్రాల్లో నమోదు కాగా, ఏపీ,తెలంగాణా,ఉత్తరప్రదేశ్ లలో కూడా అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ కరోనా మహమ్మారి కి సామాన్య ప్రజానీకం తో పాటు ప్రజా ప్రతినిధులు కూడా బలై పోతున్నారు.శనివారం మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనా కాటుకు బలై పోగా, తాజాగా యూపీ మంత్రి,మహిళా నేత కమలా రాణి కూడా కరోనాకు బలైపోయినట్లు తెలుస్తుంది.

ఇలా ప్రజాప్రతినిధులు కూడా వరుసగా కరోనా మహమ్మారి కి బలైపోతుండడం తో సామాన్య ప్రజల్లో భయాందోళనలు మొదలవుతున్నాయి.మరోపక్క ఈ మహమ్మారి కి వాక్సిన్ కనుగొన్నప్పటికీ కొంతకాలం ఈ మహమ్మారితో యుద్ధం చేయాల్సిందే అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#India #Corona Deaths #Corona Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

50 Thousand Corona Cases India Related Telugu News,Photos/Pics,Images..