శ్రీముఖి పరువుతీసిన యాంకర్ సుమ.. తొక్కేసే పర్సనాలిటీనా అంటూ..?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న కొన్ని సీరియళ్లు రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఆ సీరియళ్లలో నటించే నటీనటులకు వెండితెరను మించి పాపులారిటీని తెచ్చిపెడుతున్న సంగతి తెలిసిందే.టీవీ ఛానెళ్లకు సీరియళ్ల ద్వారానే ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయి.

 50 Plus Celebrities In Star Maa Parivaar Championship Promo Goes Viral In Social-TeluguStop.com

సీరియల్ నటీనటులు సైతం షోలు, ఈవెంట్లలో పాల్గొంటూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానెల్ లో స్టార్ మా పరివార్ ఛాంపియన్ షిప్ పేరుతో ఒక ఈవెంట్ ప్రసారం కానుండగా ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.50కు పైగా టీవీ సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొంటుండటం గమనార్హం.తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ కాగా ఆ ప్రోమో నెటిజన్లను ఆకట్టుకోవడం గమనార్హం.

ప్రోమోలో యాంకర్ సుమతో పాటు మరో యాంకర్ శ్రీముఖి కూడా మెరిశారు.సుమ 50 మంది సెలబ్రిటీలను చూసి ఎటుచూసినా మొత్తం తన ఫ్యామిలీనే కనిపిస్తుందని కామెంట్ చేస్తారు.

శ్రీముఖి నన్ను చెప్పనియ్యి అక్క ఎప్పుడూ తొక్కేస్తావ్ అంటూ ఏడుపు ముఖం పెట్టగా తొక్కేసే పర్సనాలిటీనా నీది అంటూ సుమ శ్రీముఖి పరువు తీసేశారు.ఈ ప్రోమోకు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా ఈ షో ఎప్పుడు ప్రసారమవుతుందో చూడాల్సి ఉంది.

18 సెలబ్రిటీ జంటలు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వనున్నట్టు ప్రోమోలో పేర్కొన్నారు.ప్రముఖ కమెడియన్ అవినాష్ లేడీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి కార్తీకదీపంలో ఈ దీపం కూడా పెట్టొచ్చు కదా అంటూ కామెడీని పండించారు.కొంతమంది సింగర్లు షోలో తమ కామెడీతో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందించారు.సుమ, శ్రీముఖి తమ యాంకరింగ్ తో ప్రోగ్రామ్ ను మరో లెవెల్ కు తీసుకుళుతున్నారని చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube