న్యూజిలాండ్ ఘటన నిందితుడిపై 50 మర్డర్ కేసులు..!!!  

50 Murder Cases On New Zealand Culprit-

ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ఘటన న్యూజిల్యాండ్ లోని క్రైస్ట్‌ చర్చ్ లో జరిగిన కాల్పుల ఘటన.ఈ ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు.ఫేస్బుక్ లో లైవ్ పెట్టి మరీ రెండు మసీదులోకి చొరబడి కాల్పులు జరిపి 50 మంది ప్రాణాలను బలిగొన్న ఆ వ్యక్తిని ఎవరూ మర్చిపోరు.అయితే.

50 Murder Cases On New Zealand Culprit--50 Murder Cases On New Zealand Culprit-

ఈ ఘటన తాలూకు నిందితుడు బెన్ర్‌టోన్‌ టరెంట్‌ 50 హత్యాభియోగాలను ఎదుర్కోనున్నాడని పోలీసులు తెలిపారు.వీటితో పాటు మరో 39 హత్యాప్రయత్నం అభియోగాలను శుక్రవారం కోర్టులో హాజరుపరిచే సమయంలో ఎదుర్కొనున్నాడని వెల్లడించారు.

ఈ నిందితుడు జాతి విద్వేషం కారణంగా ఈ హత్యలకి పాల్పడ్డాడు.అయితే ఈ దాడి తరువాత కేవలం అతడిపై ఒక హత్యకి సంబంధించిన అభియోగాలు మాత్రమే నమోదయ్యాయి.

ఇదిలాఉంటే క్రైస్ట్‌ చర్చ్ లోని హైకోర్టు ఎదుట అతడిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరు పరుస్తారు.