జాలారి పంట పండింది... ఏకంగా రూ.50 కోట్లు విలువ చేసేది వలలో పడింది!

ఎప్పటిలాగే ఆ జాలరులు వేటకు వెళ్లారు.పడవ ఎక్కేముందు జాలర్లు గంగమ్మకు మొక్కుకున్నారు.

 50 Crores Worth Ambergris Cautht To Tamilnadu Fishermen Details, Viral Latest ,-TeluguStop.com

ఎక్కువ చేపల్ని ఈరోజు వేటాడాలని కోరుకున్నారు.ఆ గంగమ్మ దయతో.

మెడిసిన్ కోసం ఉపమోగించే అరుదైన చేపలు వాళ్ళకి చిక్కితే పండగే.లేదంటే.

రోజు కూలి మందం అయినా ఎన్నో కొన్ని చేపలు అయినా పడతాయి.అయితే ఈసారి తమిళనాడులోని జాలర్లను మాత్రం అరుదైన అదృష్టం వరించింది.చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలల్లో ఏకంగా రూ.50 కోట్ల విలువైన అంబర్‌ గ్రిస్‌(తిమింగలం వాంతి) చిక్కింది.

వల బరువుగా ఉండడంతో పెద్ద చేప పడింది అని అనుకున్నారు.తీరా ఒడ్డుకు తీసుకొచ్చి చూడగా తిమింగళం వాంతిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.అయితే కొందరిలాగా వారు దురాశకు పోయి దాన్ని అమ్ముకోడానికి ప్రయత్నంచలేదు.నిజాయితీగా వ్యవహరించి అచ్చిరుపాక్కం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించారు.ఈ నేపథ్యంలో మొత్తం 38.6 కిలోల అంబర్‌ గ్రిస్‌ చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.తిమింగలం వాంతి దొరికిన విషయాన్ని చెప్పిన జాలర్లు ఇంద్రకుమార్‌, కర్ణన్‌, మాయకృష్ణన్‌, శేఖర్‌‌లను అధికారులు ప్రశంసించారు.

Telugu Ambergris, Amount, Latest, Whale Vomit-Latest News - Telugu

స్పెర్మ్ తిమింగలాలు చేసుకునే వాంతిని అంబర్‌ గ్రిస్‌ అంటారు.విలువ కారణంగా.దీన్ని ఫ్లోటింగ్ గోల్డ్ అంటారు.

స్పెర్మ్ వేల్స్ జీర్ణవ్యవస్థలో ఇది తయారవుతుంది.వేటాడినప్పుడు స్పెర్మ్ వేల్స్.

ఒక ప్రత్యేకమైన పదార్థాల్ని విడుదల చేస్తాయి.ఈ పదార్థాలు స్పెర్మ్‌ వేల్ శరీరానికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రొటెక్ట్ చేస్తాయి.

ఆ తర్వాత వేల్స్ శరీరంలోని వ్యర్ధాలను వాంతి చేస్తాయి.ఇది నీటిపై తేలుతుంది.

సూర్యరశ్మి, ఉప్పు నీరు కలయికతో అంబర్ గ్రీస్‌గా మారుతుంది.ఈ అంబెర్‌గ్రిస్ తొలుత దుర్వాసన కలిగివుంటుంది.

కాలం గడుస్తున్నకొద్దీ అది సువాసనను వెదజల్లుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube