తల్లిపై అలిగి కారేసుకుపోయాడు: అమెరికాలో పోలీసులకు చుక్కలు చూపించిన ఐదేళ్ల బాలుడు

అడిగినవి కొని ఇవ్వకపోయినా… తనకు నచ్చినట్లు జరగకపోయినా చిన్నారులు తల్లిదండ్రులపై అలుగుతారు.భోజనం మానేయ్యడమో, గుక్కపెట్టి ఏడవటమో చేస్తారు.

 Lamborghini , Five Years Child, Parents, Car Driving,5 Year Old Boy,parents Car-TeluguStop.com

కానీ అమెరికాకు చెందిన ఓ ఐదేళ్ల బాలుడు మాత్రం అలిగి తల్లిదండ్రులకు, పోలీసులకు చుక్కలు చూపించాడు.
అసలు సంగతిలోకి వెళితే.

ఉటావాకు చెందిన ఐదేళ్ల బాలుడు తనకు లగ్జరీ కారు లంబోర్గిని కొనాలంటూ తల్లితో మారం చేశాడు.ఇందుకు ఆమె నిరాకరించింది.

అమ్మ మీద అలిగిన ఆ చిన్నారి.ఇంట్లో ఎవరికీ తెలియకుండా కారు తాళాలు తీసుకుని, తన దగ్గర ఉన్న 3 డాలర్లతో లంబోర్గిని కొనేందుకు కాలిఫోర్నియా బయల్దేరాడు.

మార్గమధ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు బాలుడిని కారులో చూసి షాకయ్యారు.

డ్రైవింగ్ సీట్లో ఉన్న పిల్లాడిని చూసి.ఈ కారు నువ్వే నడుపుతున్నావా… నీ వయసెంత అని ప్రశ్నించగా ఐదేళ్లని చెప్పాడు.ఇంత చిన్న వయసులో డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నావ్ అంటూ బాలుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

తల్లిపై అలిగి లంబోర్గిని కొనేందుకు వెళ్తున్నానని చెప్పడంతో దాని ధర 2 లక్షల డాలర్లు ఉంటుందని చిన్నారికి వివరంగా చెప్పారు.ఇంటి దగ్గరి నుంచి నాలుగైదు కిలోమీటర్ల వరకు కారు నడిపిన ఆ బాలుడు అదృష్టవశాత్తూ మార్గమధ్యంలో ఎక్కడా యాక్సిడెంట్ చేయలేదు.

అయితే బాధ్యతగా చూసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో తల్లిదండ్రులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube