క్రికెట్ చరిత్రలో ఐదు వింతలు మీకోసం..

ప్రపంచాన్ని ఊపేస్తున్న క్రికెట్ లో ఎన్నో వింతలు జరుగుతుంటాయి.అంతేకాదు.పలు అరుదైన రికార్డులు మోగుతుంటాయి.తాజాగా మనం క్రికెట్ చరిత్రలో జరిగిన 5 వింతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 5 Weird Things Happened In Cricket History, Cricket, Cricket Weird Things, Wonde-TeluguStop.com

షార్టెస్ట్ సిక్స్


పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ బౌండరీ శ్రీలంకపై జరుగుతున్న మ్యాచ్ లో ఓ బ్యాక్ స్వీప్ షాట్ కొట్టాడు.ఆ బాల్ బౌన్స్ అయ్యి వికెట్ కీపర్ తల మీది నుంచి వెళ్లి దూరంగా ఉంచిన తన హెల్మెట్ కు తగిలింది.

ఇది రూల్స్ కు విరుద్ధం.దీంతో అంపైర్ వెంటనే బ్యాటింగ్ టీంకు ఐదు రన్స్ ఇచ్చాడు.అప్పటికే ఒక పరుగు తీయడంతో మొత్తం సిక్స్ రన్స్ వచ్చాయి.క్రికెట్ హిస్టరీలో ఇది ఫాస్టెస్ట్ సిక్స్ గా మారిపోయింది.

అతి చిన్న టెస్ట్ మ్యాచ్


Telugu Australia, Cricket, Cricket Weird, Jayasurya, Age Cricket, Rashid Lateef,

1932 లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ కేవలం 5 గంటల 53 నిమిషాలలో పూర్తయింది.క్రికెట్ హిస్టరీలో అతి చిన్న టెస్ట్ మ్యాచ్ గా రికార్డుకెక్కింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 23.2 ఓవర్స్ ఆడి 36 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది.ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో విన్ అయ్యింది.

మోస్ట్ డక్ ఔట్స్


Telugu Australia, Cricket, Cricket Weird, Jayasurya, Age Cricket, Rashid Lateef,

శ్రీలంక బ్యాటింగ్ లెజెండ్ జయసూర్య 34 సార్లు డక్ ఔట్ అయ్యాడు.వన్డే మ్యాచ్ లలో ఎక్కువ సార్లు డక్ ఔట్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు.

49వ యేట బరిలోకి


Telugu Australia, Cricket, Cricket Weird, Jayasurya, Age Cricket, Rashid Lateef,

ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ జేమ్స్ సౌథర్టన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తన 49వ యేట తొలి మ్యాచ్ ఆడాడు.తన ఇంటర్నేషనల్ కెరీర్ లో ఆడింది రెండు మ్యాచులే అయినా.ఎంతో పేరు పొందాడు.

24 గంటలలో మూడుసార్లు ఔట్


Telugu Australia, Cricket, Cricket Weird, Jayasurya, Age Cricket, Rashid Lateef,

పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్ 24 గంటల వ్యవధిలో మూడుసార్లు ఔట్ అయ్యాడు.ఇంగ్లాండ్ తో జరిగిన టి20 లో అక్మల్ 9 బాల్స్ కు 4 రన్స్ కొట్టి ఔట్ అయ్యాడు.మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ చేసి మళ్లీ వికెట్ కోల్పోయాడు.

అటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో అక్మల్ 8 బాల్స్ ఆడి 1 పరుగు చేసి వికెట్ కోల్పోయాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube