మొటిమలపై నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించాలి  

  • నిమ్మ అనేది ఒక సిట్రస్ జాతి ఫలం. ఈ జాతి ఫలాలన్ని విటమిన్ సి చాలా ఎక్కువ మోతాదులో కలిగి ఉంటాయి. వీటిలో యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ. అందుకే చిన్నపెద్ద, ఎన్నోరకాల సమస్యలకి నిమ్మని వాడతారు. నిమ్మ మొటిమలపై కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇందులో సిట్రిక్ ఆసిడ్, ఫాస్పరస్ కుడా ఉండటంతో ఇది మొటమలని, మచ్చలని పోగొట్టగలదు. రోజు నిమ్మరసం తాగే అలవాటు ఉంటే మొటిమలు రావడం కూడా కష్టం. ముందు నిమ్మరసాన్ని తాగడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే మొటిమలతో, మచ్చలతో బాధపడుతోంటే నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించి కోమలమైన చర్మాన్ని పొందండి.

  • * సుబ్బుకి బదులు శెనగపిండి ఒంటికి రాసుకోని స్నానం చేయడం ఎంతో లాభదాయకం తెలుసా ? ఎందుకంటే శెనగపిండి కెమికల్స్‌ లేని చాలా మైల్డ్ సోప్ లా పనిచేస్తుంది. ఇలాంటి శెనగపిండిలో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి. దీన్ని ఓ ఫేస్ ప్యాక్ లా ఇరవై నిమిషాల నుంచి అరగంట ఉంచుకోని కడిగేసుకోండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి.

  • * తేనే మొటిమలపై, మచ్చలపై దాడి చేస్తుంది. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండటం వలన ఇది మొటిమల ఇంఫెక్షన్ ని తగ్గిస్తుంది. ఇక తేనేకి నిమ్మరసం కలిపితే, ఇదో స్కిన్ కేర్ ప్రాడక్ట్. ఈ మిశ్రమాన్ని రోజు ముఖానికి రాయండి. మొటిమలు, వాటి వలన వచ్చే మచ్చలు, రెండూ పోతాయ్.

  • * గుడ్డు సొన కూడా మొటిమలపై పనిచేస్తుంది. ఒక గుడ్డు చాలు. ఆ సొనలో నిమ్మరసం పిండి ముఖానికి పట్టి, ఆరిపోయే దాకా ఉంచి, ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోండి. మొటిమలు పోవడమే కాదు, ముఖం కోమలంగా మారుతుంది.

  • * ప్రొబయోటిక్స్ కలిగిన పెరుగు కూడా మొటిమలపై దాడి చేస్తుంది. దీంట్లో నిమ్మరసం కలుపుకోని రోజు ముఖానికి పట్టండి. ఓ వారం తరువాత మెల్లిగా ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమం చాలా చవక కూడా.

  • * మొటిమల తీసుకొచ్చిన మచ్చలు పోవాలంటే కరివేపాకు బాగా రబ్బి, ఆ పేస్టులో పచ్చి పసపు పేస్టు, నిమ్మరసం కలపండి. మచ్చలు ఉన్న చోట దీన్ని రాయండి. మచ్చలు మాయమైపోతాయి.