ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టాలంటే ... ఈ ట్రిక్స్ పనికొస్తాయి   5 Super Tricks To Fall Asleep Quickly     2017-03-16   23:18:31  IST  Raghu V

ప్రతి రోజు, ప్రతి రాత్రి మనకు ఎదురయ్యే ఛాలెంజ్ .. త్వరగా నిద్రపోవడం. ఇక్కడ త్వరగా నిద్రపోవడం అంటే 8 గంటలకో, 9 గంటలకి నిద్రపోవడమో కాదు. నిద్రకు ఉపక్రమించిగానే నిద్ర పట్టడం. రాత్రి 10 గంటల సమయానికి నిద్రపోదామని బెడ్ మీదా వాలారనుకోండి. 10 గంటలకే నిద్రపట్టడం లేదు కదా. 11 అవొచ్చు, 12 అవొచ్చు. ఈరకంగా మన నిద్రలో ఒకటిరెండు గంటల్ని వృధా చేసుకుంటున్నాం. తద్వారా ఉదయం త్వరగా లేవాల్సివస్తే, నిద్ర అసంపూర్ణంగానే ఉండిపోతోంది. ఏడెనిమిది గంటల నిద్ర తీయాల్సింది పోయి, ఐదారు గంటల నిద్రతోనే సరిపెట్టుకుంటున్నాం. ఇది మనం అనుకున్నంత చిన్న సమస్య ఏమి కాదు. నిద్రలేమి చాలా పెద్ద సమస్య.

మరి ఇలా బెడ్ మీద సమయం వృధా కాకూడదు అంటే ఏం చేయాలి ? బెడ్ మీద వాలిన కొన్ని నిమిషాల్లోనే నిద్రలోకి జారుకోవాలంటే ఏం చేయాలి ? స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం ఒక మార్గమే అయినా, అది ప్రమాదకరం. అందుకే ఎలాంటి మందులు కాని డ్రగ్స్ కాని వాడకుండా, ఈజీగా నిద్ర ఎలా పోవాలో చెప్తాం చూడండి. సులువుగా నిద్రపట్టడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. అందులో ప్రభావంతమైన అయిదు ట్రిక్స్ లేదా చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాం. ఆ అయిదు ట్రిక్స్ లో మీకు ఏది సులభతరం అనిపిస్తే దాన్నే ఉపయోగించండి.

ఆకుపంక్చర్ లాంటి టెక్నికే ఈ ఆక్యుప్రేషర్. ఇది ఒక చైనీస్ థియరీ. శరీరంలో కొన్ని పాయింట్స్ నుంచి ఎనర్జీ ఫ్లో అవుతుందని, ఆ పాయింట్స్ మీద కొద్దిపాటి ఒత్తిడి తీసుకురావడం వలన మన శరీరం యొక్క బ్యాలెన్స్ మీద మనకి కంట్రోల్ దొరుకుతుందని, డిప్రెషన్, మానసిక ఒత్తిడి పోయి త్వరగా నిద్రపడుతుందని చెబుతారు. మరి శరీరంలోని ఆ పాయింట్స్ ఏంటో, మీరు ఎక్కడ మీ వేళ్ళతో కొంచెం ఒత్తిడి తీసుకురావాలో చూడండి.

* రెండు కనుబొమ్మల నడుమ, ముక్కుపైన, సరిగ్గా మధ్యలో కాసేపు ఒత్తి పట్టండి. డిప్రెషన్ లెవెల్స్ ని కంట్రోల్ లోకి వచ్చి నిద్రపడుతుంది.

* మీ అరచేయి చివరివేలుకి సూటిగా వస్తూ, సరిగా మణికట్టు దగ్గర కాసేపు నొక్కండి. మళ్ళీ బోటనవేలుకు సూటిగా వస్తూ మణికట్టు దగ్గర కాసేపు నొక్కండి.

* మీ కాళ్ళలో బొటన వేలు, రెండోవ వేలుకి మధ్యలో, రెండు వెళ్ళ దూరం పైన, ఈ పాయింట్ మీద కాసేపు నొక్కండి.

* భుజానికి, మెడకి సరిగ్గా మధ్యలో కాసేపు నొక్కండి. రెండువైపులా చేయండి.

మన శరీర తత్వమే అంత. నిద్ర పట్టాలంటే చల్లటి వాతావరణం, తక్కువ టెంపరేచర్ కావాలి. మీ బెడ్ రూమ్ టెంపరేచర్ తగ్గించండి. అది ఏ కాలమైనా సరే, పడుకోవడానికి ఒక గంట ముందు కూలర్ వేయండి. రూమ్ చల్లబడ్డాక నిద్రకు ఉపక్రమించండి. ఇక మన శరీరం యొక్క టెంపరేచర్ తగ్గించాలంటే పడుకోవడానికి ముందు స్నానం చేయండి. వేడినీళ్ళతో స్నానం వద్దు. చన్నీళ్ళు, చలికాలమైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. శరీరం ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. బాడి టెంపరేచర్ తగ్గుతుంది. నిద్ర త్వరగా పట్టడమే కాదు, ఎటువంటి ఆటంకం లేని నిద్ర పడుతుంది. ప్రశాంతంగా, మధ్యలో నిద్రలోంచి బయటపడకుండా, పరిపూర్ణమైన నిద్ర తీయవచ్చు.

ఈ టెక్నిక్ ని డాక్టర్ ఆండ్రూ వీల్ కనిపెట్టారు. ఈ టెక్నిక్ ద్వారా నిమిషం నుంచి రెండునిమిషాల్లోనే నిద్ర పట్టేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పధ్ధతి పాటించడం వలన రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయట. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా బయటకి వెళ్లి, హార్ట్ రేట్ ప్రశాంతగా మారి, సులువుగా నిద్రపడుతుందట. ఇక ఈ టెక్నిక్ ని ఎలా అమలు చేయాలంటే.

* మీ నాలుకని పై దంతాల వెనుక చిగుళ్ళ దగ్గర ఉంచండి. ఈ టెక్నిక్ పూర్తయ్యేదాకా అలానే ఉంచండి.

* మీ నోటి ద్వారా గాలి వదలండి, గట్టిగా వదలండి.

* మీ నోటిని మూసి, మనసులో నాలుగు లెక్కపెడుతూ ముక్కుతో గట్టిగా గాలి పీల్చుకోండి.

* ఆ తరువాత 7 సెకన్ల పాటు, లేదా మనసులో ఏడు లెక్కపెడుతూ శ్వాసను ఆపేయండి.

* ఇప్పుడు 8 అంకెలు మనసులో లెక్కపెడుతూ నోటి ద్వారా గట్టిగా గాలి బయటకి వదలండి.

* ఇలా ఒకటి రెండు నిమిషాలు చేసి, నిద్రలోకి జారుకోండి.

ఎదో స్లో గా రన్ అవుతున్న సినిమా చూస్తే మీకు నిద్ర ఎందుకు పడుతుంది ? మీ మెదడు యాక్టివ్ గా ఉండకపోవడం వలన ఇలా జరుగుతుంది. అందుకే పాఠం నచ్చకపోతే విద్యార్థులు స్కూలులో నిద్రపోయేది. బోర్ కొట్టడం అంటే మన మెదడు ఒక విషయంపై దృష్టి నిలుపలేకపోవడం. అందుకే, రాత్రి మీకు మీరే బోర్ ఫీల్ అయ్యేలా చేసుకోండి. కథల పుస్తకాలు చదివితే మెదడు యాక్టివ్ గా ఉంటుందేమో, మీకు నచ్చని పుస్తకాలు చదవండి. విద్యార్థులు అయితే తమ పాఠ్యపుస్తకములు ముందేసుకుంటే చాలు, ఇట్టే నిద్రపోతారు. ఈ టెక్నిక్ ని తేలిగ్గా తీసిపారేయకండి. మన సెలబ్రిటీలు కూడా బెడ్ మీద వాలగానే పెద్దగా ఇంటరెస్టింగ్ లేని ఓ పుస్తకాన్ని అందుకుంటారు. నిమిషాల్లోనే నిద్రపోతారు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న టెక్నిక్ ఇది. ఇక చివరి టెక్నిక్ చాలా ఇంటరెస్టింగ్ .. మీకు నచ్చే టెక్నిక్ .. అదేంటో చూడండి.

సెక్స్ పూర్తవగానే, కాసేపటికి తమ భర్తలు నిద్రలోకి వెళ్లిపోతారని భార్యలు చెబుతుంటారు. ఇలా ఎందుకు ? ఒకటి, మనిషి అలసిపోవడం వలన, రెండు – స్ట్రెస్ దూరం కావడం వలన, మూడు – ఎండార్ఫిన్స్ అనే హార్మోను బాగా విడుదల కావడం వలన. సెక్స్ కేవలం మగవారికే కాదు, ఆడవారికి కూడా ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. అయితే, ఆడవారితో పోల్చుకుంటే, మగవారికి త్వరగా నిద్రపట్టే అవకాశం ఎక్కువ. భావప్రాప్తి మనసుకి ఆనందాన్ని, ప్రశాంతతని అందిస్తుంది. హాయిగా అనిపించే హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. అందుకే త్వరగా పట్టేది.. మరి సెక్స్ చేయడానికి భాగస్వామి లేకపోతె ? ఏముంది హస్తప్రయోగం చేసుకోవడమే. సెక్స్ లో వచ్చేంత అలసట రాదు కాని, క్లయిమాక్స్ ఐతే చూస్తారు కదా. హస్తప్రయోగం వలన కూడా ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. హాయిగా, త్వరగా నిద్రపడుతుంది.