మరో ఫైవ్ స్టార్ హోటల్ నిర్వాకం, మూడు కోడిగుడ్ల కు ఏకంగా 1672 రూపాయల బిల్లు

ఆమధ్య ఒక బాలీవుడ్ నటుడు చండీగఢ్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో దిగి రెండు అరటి పండ్ల ను ఆర్డర్ ఇవ్వగా ఏకంగా ఆ రెండు అరటిపండ్ల కోసం రూ.442.50 బిల్లు వేసి అతనికి గట్టి ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆ సంగతి సోషల్ మీడియా లో తెగ హల్ చేసింది కూడా.

 5 Star Hotel Charges 1672 Rupees For 3 Boiled Eggs For Celebrity-TeluguStop.com

అయితే ఇంకా ఆ ఘటన మరువక ముందే ఇలాంటి మరో బాగోతం బయటపడింది.అయితే ఈ సారి కూడా ఒక సెలబ్రిటీ కే ఈ అనుభవం ఎదురుకావడం విశేషం.

బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావూజీ గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలోని హోటల్ హయత్ రెజెన్సీ అనే 5స్టార్ హోటల్‌లో బస చేశారు.అయితే గురువారం భోజనం గా మూడు ఎగ్ వైట్ లను ఆర్డర్ ఇవ్వగా,సర్వీస్ బాయ్ వచ్చి మూడు ఎగ్స్ ను ఇచ్చి దానితో పాటు బిల్లు కూడా చేతిలో పెట్టాడు.

Telugu Hotelrupees, Telugu Ups-

అయితే తీరా బిల్లు చూడగా అతడి మైండ్ బ్లాంక్ అయిపోయినట్లు అయ్యింది.నిజంగా కాదా అన్న విషయం కూడా అర్ధంకాక కాసేపు అలానే ఉండిపోయాడు.కేవలం మూడు ఎగ్ ల ఖరీదు అక్షరాలా రూ.1672 కావడం విశేషం.ఆ బిల్లును చూసి నోట మాట రాక శేఖర్ ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.మూడు ఉడికించిన కోడిగుడ్లకు 1350 రూపాయలు, దానికి సర్వీస్ చార్జీగా 67.50 రూపాయలు, దీనిపై సీజీఎస్టీ 9 శాతం కింద 127.58 పైసలు, ఎస్ జీఎస్టీ 9 శాతం కింద మరో రూ.127.58 కలిపి మొత్తం 1672రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు.దీంతో ఆ బిల్లును చూసి అవాక్కయిన సంగీత దర్శకుడు శేఖర్ రావూజీ హోటల్ బిల్లుతో సహా సోషల్ మీడియా లో ట్వీట్ చేశారు.

Telugu Hotelrupees, Telugu Ups-

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తుంది.గతంలో నటుడు రాహుల్ బోస్ కు అరటి పండ్ల విషయంలో జరిగిన నేపథ్యంలో ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ డిపార్టుమెంటు వారు రంగంలోకి దిగి రెండు అరటిపండ్లకు అధికంగా బిల్లు వేసిన ఆ ఫైవ్ స్టార్ హోటల్ కు రూ.25వేల జరిమానా విధించిన విషయం తెలిసిందే.మరి మూడు కోడిగుడ్ల కు ఏకంగా 1672 రూపాయలు బిల్లు వేసిన ఈ స్టార్ హోటల్ కు ఎలాంటి జరిమానా విధించి కంట్రోల్ చేస్తుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube