అందంగా కనబడటానికి అయిదు మార్గాలు  

5 Simple Ways To Look Beautiful -

చూడముచ్చటగా, అందంగా, గ్రెషియస్ గా కనబడాలని అందరికి ఉంటుంది.దీనికోసం ఏవేవో మందులు వాడనక్కరలేదు.

టైమ్ కేటాయించి ఫేస్ ప్యాక్ రోజూ పెట్టుకోవాల్సిన పనే లేదు.అయిదు మార్గాలు, అయిదంటే అయిదే అలవాట్లు చాలు.

5 Simple Ways To Look Beautiful-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

* నీళ్లు బాగా తాగడం, ఎల్లప్పుడ హైడ్రేటెడ్ గా ఉండటం.ఇది అన్నిటికన్నా ముఖ్యమైన పని.చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వరకే కాదు, శరీరాన్ని లోపలి నుంచి అందంగా ఉంచుకుంటేనే బయటకి కూడా అందంగా కనబడతారు.

* సరైన నిద్ర కేటాయించడం.

శరీరానికి సరైన విశ్రాంతిని ఇవ్వనంత కాలం అందంగా కనబడాలనుకోవడం అత్యాశే.రోజుకి 7-8 గంటల నిద్ర ఖచ్చితంగా ఒంటికి ఇవ్వాల్సిందే.

అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

* చెడు అలవాట్లకి దూరంగా ఉండటం.

సిగరేట్లు, మద్యం మీ అందాన్ని, చర్మ సౌందర్యాన్ని చెడగొట్టేవే.ముఖ్యంగా సిగరేట్లకి దూరంగా ఉండటం.

మహేష్ బాబు, హృతిక్ రోషన్ లాంటి అందగాళ్ళు సిగరేట్లు ఎందుకు మానేశారో అర్థం చేసుకోండి.అలాగే అరోగ్యకరమైన తిండి, ఫలాలు తినడం.

* శరీరాన్ని కదిలించడం.అంటే క్రమం తప్పని వ్యాయామం.

శరీరాన్ని ఒకే చోట కూర్చోబెట్టకుండా, కాస్త పనిని ఇవ్వండి.రక్తం శరీరమంతా బాగా సరఫరా జరిగేలా చూసుకోండి.

* వేదాంతం లాగా అనిపించినా, నవ్వు అందాన్ని పెంచుతుంది.నవ్వులో ఉన్న అందం మరెక్కడ ఉండదు.

మానసిక సమస్యలను దగ్గరకి రానివ్వకుండా నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించండి.మీరెప్పుడు అందంగా కనబడతారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

5 Simple Ways To Look Beautiful Related Telugu News,Photos/Pics,Images..

footer-test