కెనడా: మతాచారం కంటే మానవత్వమే మిన్న... ‘‘ టర్బన్స్ ’’ సాయంతో ఇద్దరి ప్రాణాలు కాపాడిన సిక్కులు

5 Sikh Men Use Turbans To Rescue Hikers From River In Spate In Canada

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

 5 Sikh Men Use Turbans To Rescue Hikers From River In Spate In Canada-TeluguStop.com

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

 5 Sikh Men Use Turbans To Rescue Hikers From River In Spate In Canada-కెనడా: మతాచారం కంటే మానవత్వమే మిన్న… ‘‘ టర్బన్స్ ’’ సాయంతో ఇద్దరి ప్రాణాలు కాపాడిన సిక్కులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాతలు తండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూనే వుంటారు.సిక్కులు అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది వారి ఆహార్యంలోని ‘తలపాగా’.

చూడటానికి ఆకర్షణీయంగా.అందంగా, హుందాగా ఉంటుంది ఈ తలపాగా.

అయితే తమకు మానవత్వం కంటే మతాచారాలు ముఖ్యం కాదని నిరూపించారు ఐదుగురు సిక్కు యువకులు.ఎదుటి వ్యక్తి ప్రాణాలు ఆపదలో వున్నప్పుడు సాయం చేయనివ్వని ఆచారం ఎందుకని భావించిన వారు ఏకంగా సిక్కులు పవిత్రంగా భావించే తలపాగాల సాయంతోనే ప్రాణాలు రక్షించారు.

కెనడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే.బ్రిటీష్ కొలంబియాలోని గోల్డన్ ఇయర్స్ ప్రోవిన్షియల్ పార్క్ వద్ద కుల్జీందర్ కిండా అనే సిక్కు వ్యక్తి తన నలుగురు స్నేహితులతో కలిసి పర్వతారోహణకు వెళ్లారు.ఆ సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు రాతిపై నడుచుకుని వెళ్తూ కాలుజారి అక్కడ జలపాతానికి సమీపంలోని కొలనులో పడ్డారు.

దానిని చూసిన కుల్జీందర్ కిండా, అతని స్నేహితులు… వారిని ఎలాగైనా కాపాడాలని భావించారు.తొలుత ఎమర్జెన్సీ సర్వీస్‌కు కాల్ చేయాలని భావించినప్పటికీ.ఆ ప్రాంతంలో సెల్‌ఫోన్ నెట్‌వర్క్ లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు.

ఇటు చూస్తే ఏమాత్రం ఆలస్యం చేసినా వారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి.

దీంతో తమ మత విశ్వాసాలను పక్కనపెట్టి.అందరి టర్బన్(తలపాగా)లను జతచేర్చి తాడులా చేశారు.

దాన్ని నీటి కొలనులో చిక్కుకున్న వారి సమీపంలోకి వదిలారు.దాని సాయంతో ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డారు.

ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తులు కుల్జీందర్, అతని స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం వారి సాహసంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

#Sikh #SikhTurbans #Canada #TurbansRescue #GoldenEars

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube