అమ్మాయిలకి మీ మాటలు నచ్చాలంటే ఉండాల్సిన 5 లక్షణాలు  

5 Requirements In Your Talk To Attract Her-

అమ్మాయిలతో మాట్లాడటం ఒక ఆర్ట్. అది అందరికి వచ్చేది కాదు. అందుకే ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువ జరుగుతున్నాయి..

అమ్మాయిలకి మీ మాటలు నచ్చాలంటే ఉండాల్సిన 5 లక్షణాలు -

ఈ కాలంలో అమ్మాయిల మీద ఓ ఇంప్రెషన్ పడేయటానికి పెద్దగా సమయం పట్టడం లేదు, కాని ఆ ఇంప్రెషన్ ని తమ మాటల ద్వారా కాపాడుకోవడమే కష్టం. మీ మాటల ద్వారానే అమ్మాయి ఒక ఇంప్రెషన్ ని మెయింటేన్ చేస్తుంది. అందుకే మాటల అల్లిక బాగా ఉండాలి.

అమ్మాయికి విసుగు పుట్టకూడదు. ఇంకొంచెం సేపు ఈ అబ్బాయితో మాట్లాడితే బాగుండు అనిపించాలి. అలా అనిపించాలంటే ఈ 5 లక్షణాలు మీ మాటల్లో ఉండాలి.* ఎంతసేపు మీ గురించే మాట్లాడకూడదు.

ఈరోజు ఈ పని చేసాను. రేపు ఆ పని చేస్తాను. నేను అది, నేను ఇది.

నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు. ఎంతసేపు మీ గురించి, మీ ఇష్టాల గురించేనా ? ఇలా మాట్లాడే మగవారినే Self Obsessed గా గుర్తిస్తారు అమ్మాయిలు. ఇలాంటి అబ్బాయిలకి ఈగో ఉన్నా లేకున్నా, వారికి ఈగో ఉంది అనుకుంటారు.

అలాంటప్పుడు మీ మాటలు మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. తన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి.* తన రోజు ఎలా గడిచింది తెలుసుకోండి.

పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ ఈరోజు ఏం చేయబోతోందో అడగండి. ఏదైనా పనిలో మీరు సహాయం చేయొచ్చో లేదో తెలుసుకోండి. ఒకే అంటే వెళ్లి సహాయం చేయవచ్చు.

ఇంప్రెషన్ పెరిగేది ఇలానే. అలాగే రాత్రి అయితే ఆ రోజు ఎలా గడిచిందో అడగండి. దాంతో తానంటే మీకు చాలా పట్టింపు అని అర్థం అవుతుంది.

కేర్ తీసుకునే అబ్బాయితో మాట్లాడటం ఏ అమ్మాయికైనా ఆసక్తికరంగానే ఉంటుంది. * రిలేషన్ షిప్ లోకి ఎంటర్ కాకముందు మీరేమి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వనక్కరలేదు. కనీసం ఓ డ్రెస్ కొనివ్వనక్కరలేదు.

తన డ్రెస్ బాగుంది అంటే చాలు. ఈరోజు ఎందుకు చాలా అందంగా కనిపిస్తున్నావ్ అంటూ అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ వదిలితే చాలు. పొగడ్తలు ఏ అమ్మాయికి నచ్చవు చెప్పండి ? కాని పొగడ్తల్లో కూడా అతి చేయకూడదు.

ఎక్కువ చేస్తే మీరు చేసేది ఒవర్యాక్షన్ అని అర్థమయిపోతుంది. అలాగే ఆమె మూడ్ ని బట్టి, మూడ్ స్వింగ్ ని బట్టి మాటలు ఉండాలి.* మీ మాటల్లో అప్పుడప్పుడు తన కుటుంబం గురించి, వారి బాగోగుల గురించి అడగండి.

ఇలా ఓ అబ్బాయి అడిగితె ఓ అమ్మాయికి స్పెషల్ ఫీల్ కలుగుతుంది. ఓ జెంటిల్మెన్ గా కనిపిస్తాడు అబ్బాయి. అలాంటి అబ్బాయిల మాటలు నిజంగానే వినేందుకు ఇష్టపడతారు అమ్మాయిలు.

* ఊరికే ప్లేన్ గా మాట్లాడొద్దు. 90% అమ్మాయిలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే అబ్బాయిలతో మాట్లాడటం ఇష్టం. కాబట్టి ఫన్నిగా ఉండండి. కొన్ని జోకులు కలపండి, కొన్ని మీపైన వేసుకోండి.

ఎం చేసైనా, మీ మాటల్లో హ్యూమర్ ఉండాలి. కాని ఆ హ్యూమర్ ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆహ్లాదకరంగా ఉండాలి.

ఈ అయిదు లక్షణాలు ఉంటే చాలు . ఒక అమ్మాయికి మీ మాటలేప్పుడు బోర్ కొట్టవు.