హరితేజ బిగ్ బాస్ లో ఓడిపోవడానికి 5 పెద్ద కారణాలు     2017-09-28   04:19:46  IST  Raghu V

హరితేజ .. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పుడు బహుషా ఎవరు పెద్దగ అనుకోలేదు ఈ అమ్మాయ టాప్ పోటిదారుల్లో ఒకరిగా నిలుస్తుందని. కాని అందరితో కలుపుగోలుదనం, మాటల్లో చలాకితనం, మ్యెచురీటి, ఎప్పుడు ఉల్లాసంగా ఉండే గుణంతో ప్రేక్షకులని ఆకట్టుకుంది హరితేజ. ఇక బిగ్ బాస్ ఇంటి గురించి బుర్రకథ ఎప్పుడైతే చెప్పిందో, హరితేజ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. నామినేట్ అయినా, అత్యధిక ఓట్లు పొందుతూ, బిగ్ బాస్ ఫినాలేలో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది హరితేజ. టాప్ 2 లో హరితేజ ఉండటం ఖాయమని, తను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా కూడా నిలిచే అవకాశాలున్నాయని అంతా భావించారు. కాని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, హరితేజ టాప్ 2 లోకి రాలేకపోయింది. సడెన్ గా ఇంత మార్పు ఎందుకు వచ్చింది? హరితేజ ఓడిపోవడానికి కారణాలు ఏమిటి?

* బిగ్ బాస్ లో ఆదర్శ్ టాప్ 2 లోకి రావడానికి కారణం అతడికి ఇంట్లో ఎవరితోనూ గొడవలు లేకపోవడం‌. ఆ క్లీన్ ఇమేజ్ చివరి వారానికి ముందు దాకా కూడా హరితేజకు ఉన్నా, దీక్షతో గొడవలు ఆమె ఇమేజ్ ను దెబ్బతీసాయి.

* దీక్షను టార్గేట్ చేసి, అర్చనతో కలిసి దీక్షపై చాడీలు చెప్పుకుంటూ చాలా పెద్ద తప్పు చేసింది హరితేజ. దాంతో అప్పటిదాకా అమెకు బాగా సపోర్ట్ గా నిలిచిన మేల్ ఆడియెన్స్, ఆమెపై నెగెటివ్ ఇంప్రెషన్ పెంచుకున్నారు.

* కేవలం వినోదం అందిస్తేనే ప్రజలు సపోర్ట్ చేయరు. సెన్సిబుల్ ఇమేజ్ చాలా ముఖ్యం. కేవలం వినోదమే పనిచేసుంటే, హరితేజతో పాటు నవదీప్ .. ఈ ఇద్దరే టాప్ 2 లో ఉండాలి.

* ఓ వ్యక్తి చివరికి ఏం చేసాడు అనేదే మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం. కోపిష్టి గా బిగ్ బాస్ లో తన ఆట మొదలుపెట్టిన శివబాలాజీ, క్రమంగా మారుతూ ప్రేక్షకుల మెప్పు పొందాడు. శివ బాలాజీ నెగెటివ్ నుంచి పాజిటివ్ గా మారితే, హరితేజ పాజిటివ్ నుంచి నెగేటివ్ గా మారింది.

* అసలు శివ బాలాజి ఇమేజ్ లో మార్పుకి కారణం కూడా హరితేజనే. తనతో చనువు వలనే, శివబాలాజీ కోపిష్టి నుంచి సరదా మనిషిగా మారాడు‌‌. అది బాగా ప్లస్ అయ్యింది.