ఫేస్ బుక్ తీసుకొచ్చిన 5 కొత్త అప్డేట్స్ ఇవే

సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తన వినియోగదారులని మరింత ఆకట్టుకునేందుకు సరొకొత్త అప్డేట్స్ ని తీసుకొచ్చింది.తాజాగా విడుదల చేసిన అప్డేట్ లో ఇంటర్ ఫేస్ లో పలురకాల మార్పలు చేసిన ఫేస్ బుక్, ఫాంట్ సైజు పెంచి బోల్డ్ నెస్ పెంచేసింది.

 5 Newly Introduced Interesting Features In Facebook-TeluguStop.com

స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్ ధాటికి తట్టుకోని నిలబడటానికి ఇప్పటికే స్టోరీస్ తీసుకొచ్చిన ఫేస్ బుక్, ఈ కొత్త ట్రెండి అప్డేట్స్ తో ఖాతాదారులని ఫేస్ బుక్ కే అతుక్కుపోయేలా చేయాలనుకుంటోంది.మరి ఆ కొత్త అప్డేట్స్ ఏంటో చూడండి.

* మెసెంజర్ లో కొత్త కొత్త రియాక్షన్స్ తీసుకొచ్చిన ఫేస్ బుక్, కొత్తగా రిప్లైలో మన ఫోటోలని ఫంకీగా ఎడిట్ చేసుకునే వీలుని కలిపిస్తోంది.మీ మూడ్ ని బట్టి మీకు ఇష్టమైన ఫోటో ఫ్రేమ్స్ తో సరదాగా చాట్ చేసుకోవచ్చు.

స్నాప్ చాట్ కాపిలా ఉన్నా, ఎవరు పట్టించుకుంటారు అదంతా.జనాలకి యాప్ బోర్ కొట్టకుండా అదో తాపత్రయం.

* ట్విట్టర్ మెన్షన్స్ నుంచి లేపేసిన ఆప్షన్ ఇది.ఫేస్ బుక్ మెసేంజర్ లో మీరు మీ ఫ్రెండ్స్ ని మెన్షన్ చేయవచ్చు.మిమ్మల్ని ఓ చాట్ లో మెన్షన్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది.ట్విట్టర్, వాట్సాప్ తరువాత ఫేస్ బుక్ ఈ మెన్షన్స్ ఆప్షన్ ని వాడటం కోట్ల మంది యూజర్లకి నచ్చే విషయమే.

* ఈ లైవ్ లోకేషన్ అప్షన్ ని గూగుల్ నుంచి ఎత్తుకొచ్చింది ఫేస్ బుక్.మీరు ఈ ట్రాకింగ్ ని ఎనెబుల్ చేయగానే, మీరు ఎక్కడ ఉన్నారో మీ ఫ్రెండ్స్ సరిగ్గా లోకేషన్ చూడవచ్చు.

ఇది నియర్ బై ఫ్రెండ్స్ కి మెరుగులు దిద్దిన ఆప్షన్ లాంటిది.కేవలం ఏరియానే కాకుండా, నేస్తాలను పాయింట్ టూ పాయింట్ ట్రాక్ చేయవచ్చు.

* ఫేస్ బుక్ ని భారతీయులకి మరింత చేరువ చేసేందుకు “ఏ ప్లేస్ టూ కనెక్ట్” అనే ఈవేంట్ మరో కొత్త ఆప్షన్ ని అన్నౌన్స్ చేసింది ఫేస్ బుక్.అవే లోకల్ కెమెరా ఎఫెక్ట్స్.

నమస్తే ఎఫెక్ట్, కొన్ని భారతీయ నగరాల స్పెషల్ ఎఫెక్ట్స్ అందులో ఉంటాయి.

* మీ ఫేస్ బుక్ మొబైల్ యాప్ తీసుకోని న్యూస్ ఫీడ్ నుంచి రైట్ కి స్వైప్ చేయండి.

లేదంటే సింపుల్ గా కెమరా ఐకాన్ మీద ట్యాప్ చేయండి.న్యూ కెమరా అనే ఆప్షన్ వస్తుంది.

అక్కడినుంచి మీరు తీసుకున్న ఫోటో లేదా వీడియో ఫేస్ బుక్ స్టోరిలా మార్చుకోవచ్చు లేదంటే ఆ ఫోటో/ వీడీయో ఏ ఫ్రెండ్స్ తోనైతే షేర్ చేయాలనుకుంటున్నారో, వారితో మాత్రమే షేర్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube