ఒకే రోజు 5 సినిమాలు విడుదల.. జులై 30న?

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని దేశాలకు వ్యాప్తి చెంది సినిమా రంగం పై కోలుకోలేని దెబ్బ కొట్టినదని చెప్పవచ్చు.సినిమా రంగంపై కరోనా ప్రభావం ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

 5 Movies Released On The Same Day Movies , 5 Movies, Flim Industry, July 30, Rel-TeluguStop.com

ఈ క్రమంలోనే పలు సినిమాలు విడుదలకు నోచుకోకపోగా, మరికొన్ని షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి.ఇలా సినిమాలపై డబ్బులు వెచ్చించి విడుదలకు నోచుకోకుండా ఉండడంచేత నిర్మాతలు భారీగానే నష్టపోయారని చెప్పవచ్చు.

కరోనా మొదటి దశ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం తో నిర్మాతలకు కాస్త ఉపశమనం కలిగినప్పటికీ రెండవ దశ ఊహించని రీతిలో ప్రమాదాన్ని తీసుకువచ్చింది.ఈ క్రమంలోనే థియేటర్లు మళ్ళీ మూత పడ్డాయి.

ప్రస్తుతం పరిస్థితులు కుదటపడటంతో తిరిగి థియేటర్లను కరోనా నిబంధనలను పాటిస్తూ.ఓపెన్ చేయాలని ప్రభుత్వాలు అనుమతులు తెలిపింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వం అనుమతి తెలిపినా, ప్రజలు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరిస్తారన్న అనుమానం దర్శక నిర్మాతలలో నెలకొంది.ఈ క్రమంలోనే థియేటర్లు ఈనెల 30వ తేదీన తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఏకంగా 5 సినిమాలు విడుదలవుతున్నాయి.

ఈ ఐదు సినిమాలలో మూడు సినిమాలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యాయి.“నరసింహపురం”, “త్రయం”, “పరిగెత్తు పరిగెత్తు” అనే మూడు సినిమాలలో నటించే నటీనటులు ఎవరు అనే విషయం కూడా జనాలకు పెద్దగా తెలియదు.ఈ క్రమంలోనే థియేటర్లలోకి వెళ్లి ఇవి ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచిచూడాల్సిందే.

Telugu July-Movie

అదేవిధంగా తేజు సజ్జ,ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా త్రిల్లర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న “ఇష్క్” కొంతమేర ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకున్నప్పటికీ ఏ విధంగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుందో వేచి చూడాలి.అదే విధంగాసత్యదేవ్ ఈసారి “తిమ్మరుసు” అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై దర్శకనిర్మాతలు కాస్త ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.30వ తేదీ ఏసినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube