ఆ ఐదు సినిమాలను మిక్స్ చేసి దసరా తీశారా.. దర్శకుడు తెలివైనోడే కదా!

సుకుమార్( Sukumar ) శిష్యుడు, దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీకి శ్రీకాంత్ రూపంలో మరో స్టార్ డైరెక్టర్ దొరికాడని సుకుమార్ మాత్రమే కాదు సుకుమార్ శిష్యుడు కూడా టాలెంటెడ్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే దసరా సినిమాను చూసిన ప్రేక్షకులకు దర్శకుడు శ్రీకాంత్( Srikanth ) సుకుమార్ సినిమాలపై ఆధారపడ్డారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 5 Movies Mixed In Dasara Movie Details Here Goes Viral In Social Media , Dasara-TeluguStop.com

ఆర్య2, రంగస్థలం, పుష్ప సినిమాలను స్పూర్తిగా తీసుకుని దసరా( Dussehra ) సినిమాను తీశారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఈ దర్శకునిపై సుకుమార్ ప్రభావం ఎక్కువగానే ఉంది.ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ కు కాంతార సినిమా ఒక విధంగా స్పూర్తి అని చెప్పవచ్చు.కాంతార( Kantara ) క్లైమాక్స్ లా ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేయాలని భావించి కథనాన్ని ఆ విధంగా సిద్ధం చేసి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దసరా సినిమాలోని టెంప్లేట్ విషయానికి వస్తే కోలీవుడ్( Kollywood ) మూవీ మద్రాస్ ను గుర్తు చేస్తుంది.ఈ ఐదు సినిమాలను మిక్స్ చేసి దసరా తీశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టత వచ్చేసింది.

దసరా తొలిరోజే 20 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.దసరా సినిమా కలెక్షన్ల విషయంలో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సంతృప్తితో ఉన్నారు.న్యాచురల్ స్టార్ నానికి మాస్ హీరో ఇమేజ్ ను తెచ్చిన మూవీ దసరా అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఈ సినిమా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube