ప్రపంచంలో అత్యంత విషపూరితమైన 5 సర్పాలు .. ఆశ్చర్యకరమైన నిజాలు  

5 Most Poisonous Snakes In The World And Some Facts -

పాములంటే ఇక్కడ అందరికి భయమే.మనుషుల పీడకలలోకి కూడా పాములే ఎక్కువగా వస్తాయట.

అలా ఎందుకు జరుగుతుందో సరిగ్గా చెప్పడానికి ఆధారాలు లేవు కాని, ఈ కథనం చదివాక మాత్రం, మీకు పాములు వచ్చే పీడ కలలు వస్తే మాత్రం మమ్మల్ని తిట్టుకోవద్దు.ఎందుకంటే ఈ కథనం పాముల గురించి.

5 Most Poisonous Snakes In The World And Some Facts-General-Telugu-Telugu Tollywood Photo Image

అది కూడా అలాంటి ఇలాంటి పాముల గురించి కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల గురించి.మనుషులని చంపే బలాన్నే టాపిక్ గా తీసుకుంటే, టాప్ – 5 విషసర్పాలు ఇవే.వీటి విషాన్ని ఒక్కసారి పిండి, దాన్ని లక్షల ఎలుకలకి తినిపిస్తే, అందులో ఒక్కటి కూడా బ్రతకదు.మనుషులు కూడా పదుల నుంచి వందల సంఖ్యలలో చనిపోతారు.

వీటి విషానికి విరుగుడు ఉన్నా, మనిషి ఆ విరుగుడు దొరికే లోపు కూడా తనని తానూ కాపాడుకోవడం కష్టం .అంతటి ఘోరమైన విష ప్రభావం వీటి నుంచి వస్తుంది.మరి ఆ అయిదు పాములు ఏవో , అవి ఎక్కడ దొరుకుతాయో .ఒక్కో పాము, ఒక్కో గాటుతో ఎంతమంది మనుషలని ఎంతసేపట్లో చంపగలదో చూడండి.

#5 – కాస్పియన్ కోబ్రా :

కాస్పియన్ కోబ్రా అనే పాము ఎక్కువగా మధ్య ఆసియాలోని అడవుల్లో కనబడుతుంది.దీన్నే రష్యన్ కోబ్రా, ఆక్సాస్ కోబ్రా అనే పేర్లతో పిలుస్తారు.మన దేశంలో ఇవి హిమాచల్ ప్రదేశ్ అడవుల్లో, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో కనబడతాయి.ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, తుర్కమేనిస్తాన్,అడవుల్లో కూడా దర్శనమిస్తాయి.ఇవి అయిదు అడుగుల వరకు పెరగవచ్చు.వీటికి కోపం ఎకువ.

నిజానికి ఇవి మనుషులకి దూరంగా ఉండేదుకు ప్రయత్నిస్తాయి .కాని తనకి మనిషి వలన ప్రమాదం ఉందని గ్రహిస్తే, తప్పకుండా ఎటాక్ చేస్తాయి.అది కూడా ఒక్క కాటుతో వదిలిపెట్టవు.చెట్లను బాగా ఎక్కేస్తాయి .ఈత కూడా బాగా కొడతాయి .కాబట్టి తప్పించుకోవడం కష్టం.ఒక్క కాటుతో 590 మిల్లిగ్రాముల విషాన్ని కక్కుతాయి.ఈ మోతాదు విషం లక్ష అరవై వేల ఎలుకలని, 42 మంది మనుషుల ప్రాణాల్ని తీయగలదు.దీని గాటు వలన శరీరం ఉబ్బటం, తీవ్రమైన నొప్పి, బలహీనత, మూర్చ, శరీర భాగాలు పనిచేయకపోవడం జరుగుతాయి.ఆ తరువాత శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఇన్నిరకాలుగా చిత్రవధ చేసి, ఈ విషం మనిషిని కొన్ని గంటల్లో చంపేస్తుంది.

#4 .కోస్టల్ తైపాన్ :

కోస్టల్ తైపాన్ .లేదా కామన్ తైపాన్ అని అంటారు దీన్ని.ఇది ఎక్కువగా ఆస్ట్రేలియాలోనే దొరుకుతుంది.మనుషులని చంపే స్టామినాని బట్టి చూస్తే, ఇది ప్రపంచంలో నాలుగోవ అతిప్రమాదకరమైన పాము అని చెప్పవచ్చు.పది అడుగుల వరకు కూడా పెరగగల ఈ పాము, దాదాపుగా ఏడు కేజిలా బరువు ఉంటుంది.ఒక్క కాటులో 400 మిల్లిగ్రాముల విషాన్ని కక్కుతూ, ఇది 2 లక్షల 8 వేల ఎలుకలని, 56 మంది మనుషులని చంపగలదు.

ఇది పగటి పూట ఎక్కువగా వేటకి వెళుతుంది.గడ్డి ప్రాంతాల్లో, వెచ్చగా ఉన్న టెంపరేచర్ లో పెరిగేందుకు ఇష్టపడతాయి.

దీని చూపు చాలా షార్పు.తమ ఆహారాన్ని సులువుగా వేటాడుతాయి.

పక్షులని, ఎలుకలని ఆహారంగా తీసుకుంటాయి.దీని విషంలో టికాటాక్సిన్, న్యురోటాక్సిన్ ఎక్కువగా ఉంటాయి.

ఈ ఎలిమెంట్స్ ఉండటం వలన విషం శరీరంలోకి ప్రవేశించగానే రక్తం గడ్డకడుతుంది.తలనొప్పి మొదలవుతుంది, వాంతులు వస్తాయి, శరీరం పనిచేయదు, కండరాలు చిట్లిపోతాయి, కిడ్నీలు నిమిషాల్లో డ్యామేజ్ అయిపోతాయి .మొత్తం మీద అరగంట నుంచి రెండున్నర గంటల్లో మనిషి తుది శ్వాస విడిచేస్తాడు.

#3.ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ :

ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్ .ఇది ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో కనబడుతుంది.ఆస్ట్రేలియా ఖండంలో సగం అడవులని ఇవి ఆక్రమించుకొని ఉన్నాయి.సెకనుకి మూడు అడుగులు పరిగెత్తగలదు.దీన్ని కొంతమంది రెండోవ ప్రమాదకరమైన పాముగా చెబుతారు, మరికొంతమంది దీనికి మూడోవ స్థానాన్ని కట్టబెట్టారు.ఎక్కువగా పగటి పూట సంచరించే ఈ పాము, రాత్రి మాత్రం విశ్రాంతి తీసుకుంటుందట.

ఒక్క కాటుతో ఇది 155 మిల్లిగ్రాముల విషాన్ని కక్కగలదు.ఆ మోతాదు విషం 58-60 మంది ప్రాణాల్ని తీయగలదు.

అదే ఎలుకలైతే రెండు లక్షల, పదివేలకు పైగా చనిపోతాయి.ఇవి ఆరు నుంచి ఎనిమిది అడుగుల ఎత్తువరకు ఎదగగలవు.

ఇవి ఎలుకలని, కప్పల్ని, చిన్న పక్షులని, వాటి గుడ్లని, ఒక్కోసారి ఇతర పాముల్ని కూడా ఆహారంగా తీసుకుంటాయి.దీని గాటు వలన వాంతులు వస్తాయి, మూర్చ వస్తుంది, శరీర భాగాలు పనిచేయవు .చివరకి గుండె కూడా ఆగిపోతుంది .ఈరకంగా మనిషి ప్రాణాన్ని అరగంట నుంచి రెండు మూడు గంటల సమయంలో, గాటు పడిన విధానాన్ని బట్టి విషం తీసేసుకుంటుంది.

#2.ఫారెస్ట్ కోబ్రా :

ఫారెస్ట్ కోబ్రా … ఇది ఆఫ్రికా అడవుల్లో ఉంటుంది.దీని పొడవు పది అడుగుల దాకా ఉంటుందట.ఈత బాగా కొట్టగలవు .కాబట్టి నీళ్ళలో కూడా వీటి నుంచి తప్పించుకోవడం కష్టం.చెట్లు కూడా అవలీలగా ఎక్కేస్తాయి … అలా కూడా తప్పించుకోవడం కష్టం.

దాక్కొని ఎటాక్ చేయడం వీటి స్పెషాలిటి.బుద్ధిబలం బాగా ఉన్న పాములు అన్నమాట.

ఒక్క కాటుతో ఏకంగా 1102 మిల్లిగ్రాముల విషాన్ని కక్కుతుంది.ఆ విషంతో ఏకంగా 65 మంది మనుషులని చంపగలదు.

ఎలుకలైతే దాదాపుగా రెండు లక్షల యాభై వేల వరకు బలికావాల్సిందే.దీని కాటు వలన మనిషికి బలహీనంగా మారతాడు, అడుగు వేయడం కూడా కష్టం అయిపోతుంది, శరీర భాగాలు పనిచేయవు, ఏమి వినబడదు, కడుపులో విపరీతమైన నోపి, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది … ఇవన్ని అనుభవిస్తూ, గాటుని బట్టి అరగంట నుంచి మూడు గంటల్లో మనిషి చనిపోతాడు.

ఇవి ఎకువగా కప్పల్ని, బల్లులని, చేపల్ని.ఇతర పాముల్ని, పక్షుల గుడ్లని తింటాయి.

తమకన్నా బలహీనంగా ఏ ప్రాణి కనిపించినా దాడి చేస్తాయి.ఈ జాతికి చెందిన ఆడపాములు ఒకేసారి 11-26 గుడ్లని పెట్టగలవు.

#1.ఇన్లాండ్ తైపాన్ :

ఇన్లాండ్ తైపాన్ .ఇవి ఆస్ట్రేలియా అడవుల్లో ఎక్కువ దొరుకుతాయి.ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇది.ఎందుకంటే ఇది ఒక్క కాటుతో 110 మిల్లిగ్రాముల విషాన్ని కక్కుతుంది.విషాన్ని అత్యధికంగా వెదజల్లే పాము ఇది కాకపోయినా, ఒక్క కాటుతో అత్యధిక మందిని చంపగల పాము మాత్రం ఇదే.ఆ 110 మిల్లిగ్రాములతో ఇది ఎంతమంది మనుషులని చంపగలదో తెలుసా ? ఏకంగా 289 మనుషులని.అదే ఎలుకలైతే, ఒక్క కాటుతో వచ్చే విషంతో పదిలక్షల ఎనభై వేల ఎలుకలు మరణిస్తాయి.

సగటున చెప్పాలంటే, కేవలం ఒక్క మిల్లిగ్రాము తైపాన్ పాము విషంతో ఇద్దరు మనుషుల్ని చంపవచ్చు అన్నమాట.ప్రచారంలో ఉన్న థియోరికి విరుద్ధంగా, ఇవి సి స్నేక్స్ కన్నా ప్రమాదకరమైనవి అని పరిశోధకులు చెబుతున్నారు.

కాటు పడిన తీరుని బట్టి, కేవలం అరగంట లేదా నలభై అయిదు నిమిషాల్లో మనిషి తన ప్రాణాల్ని వదిలేస్తాడు.కిడ్నీలు పాడైపోతాయి, నరాలు పనిచేయవు, రక్తం గడ్డ కట్టి పోతుంది, వాంతులు చేసుకుంటూ, తలనొప్పి భరించలేక చనిపోతాడు మనిషి

5.9 అడుగుల ఎత్తు ఉండే ఇది ఎక్కువగా ఎలుకలని తింటుందట.బేసిక్ గా, ఈ పాములకి బిడియం ఎక్కువ అని అంటారు.

తమని రెచ్చగొడితే, తాము తినే ఆహారం దొరికితే తప్ప ఇవి తమ ప్రపంచంలో బ్రతికేస్తాయి.ఈ పాముకి ఉన్న స్పెషాలిటి ఏమిటంటే, ఒకేసారి, సెకన్ల గ్యాప్ లో 8 కాటులు వేయగలదు అంట.దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇది సెక్షన్ల సమయంలో ఎంతమంది మనుషుల్ని చంపగలదో.ఆస్ట్రేలియాలో దీని గాటుకి చిక్కి ప్రాణాలు వదిలినవారు చాలామందే ఉన్నారు.

ఇవి వాతావరణానికి తగ్గట్టుగా, తమ శరీర రంగుని కొద్దిగా మార్చుకోగలవు అంట.వీటిని సందర్శనకు ఆస్ట్రేలియా, రష్యాలోని జూలలో ఉంచుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

5 Most Poisonous Snakes In The World And Some Facts- Related....