మొబైల్ డేటా పొదుపుగా వాడేందుకు ఉపయోగపడే 5 యాప్స్

జియో ఉచిత ఆఫర్ ఎప్పుడో అయిపోయింది.అంతా డబ్బులు చెల్లించి పేయిడ్ సర్వీసులే వాడుతున్నారు.

 5 Mobile Data Management Apps You Should Have In Smartphone-TeluguStop.com

జియోతో పాటు మిగితా నెట్వర్క్స్ కూడా తమకి తోచిన విధంగా ఎంతో కొంత ఎకానామికల్ ఆఫర్స్ ఇస్తున్నారు.దాంతో మొబైల్ డేటా ఫ్రీ నుంచి చీప్ గా మారింది.

ఎంత చీప్ అయినా, అదేమి ఉచితం కాదుగా.చాలామంది రోజుకి 1GB ప్లాన్ లోనే ఉన్నారు.

రోజుకి 1GB డేటాతోనే సరిపెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు.ఎలాంటి యాప్స్ మీద ఎక్కువ డేటా ఖర్చు చేస్తన్నాం, ఎలాంటి యాప్స్ తక్కువ డేటా తీసుకుంటోంది, ఉన్న డేటాని ఎలా మ్యానేజ్ చేయాలి, పొదుపుగా ఖర్చుపెట్టినా, ఉన్న డేటాతో మన అవసరాలు ఎలా తీరాలి? ఈ విషయాలన్నీటి మీద మంచి అవగాహన ఉండాలి.అప్పుడే మీ దగ్గర ఉన్న మొబైల్ డేటాని మీ అవసరాలన్నీ తీరేలా పొదుపుగా వాడుకోవచ్చు.అలాంటి మేనేజ్‌మెంట్‌ కోసమే ఈ 5 యాప్స్ పనికొస్తాయి.

* Opera max :

కొన్ని యాప్స్ మన డేటాని తీనేస్తుంటాయి.మనం ఆ యాప్స్ ఎక్కువగా వాడినా, వాడకున్నా, బ్యాక్ గ్రౌండ్ రన్ తోనే మొబైల్ డేటాని ఖర్చుపెడతాయి.

అలాంటి యాప్స్ ని గుర్తించి వాటని డేటా వాడకుండా బ్లాక్ చేయడానికి, లేదంటే డేటా ఆ యాప్ వైపు ఎక్కవగా వెళ్ళకుండా అంక్షలు విధించడానికి ఈ యాప్ పనికొస్తుంది.

* True Balance :

ఈ యాప్ మన డేటా వినియోగాన్ని పూర్తిగా బయటపెడుతుంది.ఏ సమయంలో, దేనిమీద ఎక్కువ డేటా వాడుతున్నామో తెలుపుతుంది.ఎంత డేటా వాడాం? ఎంత మిగిలి ఉంది ? తదుపరి రీఛార్జీ తేది .అన్ని వివరిస్తుంది.

* Traffic monitor :

పేరులోనే దాగుంది కదా దీని పనితనం.ఇది పేరుకి తగ్గట్టే డేటా వాడకాన్ని పూర్తిగా ట్రాక్ చేయొచ్చు.ఎక్కడ కంట్రోల్ చేయాలో తెలుసుకోవచ్చు.మన నెట్వర్క్ స్పీడ్ ఎంత, ఎలాంటి యాప్స్ మీద అంక్షలు విధించాలి, అన్ని చెబుతుంది.

* My Data Manager :

పోస్ట్ పేయిడ్ వినియోగదారులకి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది.మొబైల్ డేటాని ట్రాక్ చేయడమే కాదు, మీరు పెట్టిన లిమిట్ తరువాత అలారం మోగించి మీ డేటా అయిపోయిన విషయాన్ని తెలుపుతుంది.దాంతో లిమిట్ దాటి బిల్లు ఎక్కువ కట్టాల్సిన దుస్థితి ఉండదు.

* Data Eye :

మనం పెద్దగా వాడుకున్నా, బ్యాంక్ గ్రౌండ్ లో రన్ అవుతూ మన డేటా తినేసే యాప్స్ ని పట్టడంలో ఇది నేర్పరి.మీ బ్యాటరీ పనితనాన్ని, ఖర్చుని కూడా ట్రాక్ చేస్తుంది.

ఒకే యాప్ తో ఇటు డేటాని, అటు బ్యాటరీని పొదుపుగా వాడవచ్చు అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube