జగన్ సంచలన నిర్ణయం.. వారికి రూ.5 లక్షల పరిహారం!

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.కరోనా కష్ట కాలంలో జర్నలిస్టులకు శుభవార్త చెప్పారు.

 5 Lakh Rupees Journalists Who Lost Andhra Pradesh-TeluguStop.com

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందుతున్న సంగతి తెలిసిందే.కరోనా బారిన పడి చనిపోతున్న వారిలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు ఉన్నారు.

జర్నలిస్టులు వైరస్ బారిన పడి చనిపోతున్నా వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

 5 Lakh Rupees Journalists Who Lost Andhra Pradesh-జగన్ సంచలన నిర్ణయం.. వారికి రూ.5 లక్షల పరిహారం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తోంది.

కరోనా బారిన పడి ఎవరైనా జర్నలిస్టులు మృతి చెందితే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తుంది.ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షులు జగన్ హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.

వార్తలు సేకరించే క్రమంలో జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారని.ఏపీలో ఇప్పటివరకు 38 మంది జర్నలిస్టులు వైరస్ వల్ల మృతి చెందారని శ్రీనివాసరావు చెప్పారు.

38 మంది జర్నలిస్టులు మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా సీఎం చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తానని చెప్పారని తెలిపారు.కరోనా బారిన పడి చికిత్స చేయించుకునే జర్నలిస్టులకు కూడా ప్రత్యేక బెడ్లు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

జగన్ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుకోవాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని చెప్పారు.

కేంద్రం ప్రకటించిన 50 లక్షల రూపాయల బీమాను యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి జగన్ సర్కార్ ఎప్పుడూ తోడ్పాటు అందిస్తోందని చెప్పారు.జగన్ భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.జగన్ చేసిన ప్రకటన పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

#Journalists #YSJagan #Police #AP Governament #Doctors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు