అమెరికా హకీ జట్టులో ‘‘భారతీయం ’’... 17 మంది ఆటగాళ్లలో ఐదుగురు మనోళ్లే...!!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో భారతీయ మూలాలున్న క్రికెటర్లు, ఆటగాళ్లు వున్నారు.ఇది ఇప్పుడే కొత్తగా వస్తున్నది కాదు.

 5 Indian Origin Players To Represent Usa In The Junior Mens Hockey World Cup, Us-TeluguStop.com

దశాబ్ధాల క్రితం నుంచే ఈ ట్రెండ్ కొనసాగుతోంది.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లి స్థిరపడిన భారతీయ కుటుంబాలు ప్రస్తుతం ఆయా దేశాల్లోని అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాయి.

తాజాగా అమెరికా పురుషుల జూనియర్ హాకీ జట్టులో దాదాపు ఐదుగురు భారత సంతతి క్రీడాకారులు చోటు దక్కించుకుని భారతదేశ ఖ్యాతిని రెపరెపలాడిస్తున్నారు.

ఈ నెలలో భువనేశ్వర్‌లో జరగనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అనేక దేశాల జాతీయ జట్లు ఇండియాకు చేరుకుంటున్నాయి.

భారత్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుండటం విశేషం.ఈ క్రమంలో భారత జూనియర్ హాకీ జట్టు మాజీ కోచ్ హరేంద్ర సింగ్‌… కోచ్‌‌గా వ్యవహరిస్తున్న అమెరికా జట్టు ఈసారి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

ఈ టీమ్‌లో మొత్తం ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు వుండటమే అందుకు కారణం.

Telugu Indianorigin, Gurcharan Johal, Harendra Singh, Jatin Sharma, Hockey, Hock

వీరిలో జతిన్ శర్మ, మెహతాబ్ గ్రేవాక్, గురుచరణ్ జోహల్, అమరీందర్ పాల్ సింగ్, షోమిక్ చక్రవర్తి ఈ ఏడాది అమెరికా జాతీయ హాకీ జట్టు తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జతిన్ శర్మ తండ్రి స్వయంగా ఒక ఆటగాడు.దశాబ్ధాల క్రితం ఆయన కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడి జట్టుకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.

ఆ తర్వాత జతిన్ కూడా తండ్రి బాటలో హాకీని కెరీర్‌గా ఎంచుకున్నాడు.జాతీయ జట్టులో చేరడానికి ముందు స్వయంగా తండ్రి వద్ద శిక్షణ పొందాడు.

అనంతరకాలంలో జతిన్ తండ్రి శాన్‌ఫ్రాన్సిస్కో పరిసరాల్లో హేవార్డ్ హాక్స్, స్టాన్‌ఫోర్డ్ లైట్నింగ్ యూత్ ఫీల్డ్ హాకీ క్లబ్ అనే రెండు క్లబ్‌లను స్థాపించారు.

అమెరికా హాకీ జట్టులోని ఇతర భారత సంతతి ఆటగాళ్ల విషయానికి వస్తే.

వారు వాషింగ్టన్ డీసీ, ఆరిజోనా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లోని పలు పట్టణాలకు చెందిన వారు.షోమిక్ చక్రవర్తి, జతిన్ శర్మలు ఇప్పటికే పురుషుల సీనియర్ జట్టు తరుపున ఆడారు.

జూనియర్ స్థాయిలోనూ మంచి ప్రదర్శన కనబరిచారు.వారి ప్రపంచకప్ ప్రచారానికి గాను వ్యక్తిగత విరాళాలతో పాటు ఫండ్ రైజింగ్ ద్వారా నిధులు సమకూరాయి.

దీనికి కారణం లేకపోలేదు.ఫీల్డ్ / టర్ఫ్ హాకీకి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అంతగా ఆదరణ లేదు.

అందుకే దాని పురోగతిపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు.అందుకే జూనియర్ స్థాయి ఆటగాళ్లను నిధుల కొరత వెంటాడుతోంది.

ఈ విషయంలో సీనియర్ హాకీ జట్టు కొంత వరకు పర్వాలేదని చెప్పవచ్చు.కానీ టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పురుషుల జూనియర్ హాకీ జట్టు సభ్యులు వారి కుటుంబ సభ్యులు, దాతలపై ఆధారపడాల్సి వుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube