వ్యాధులు రాకుండా ఉండేందుకు గాంధీ చెప్పిన ఆరోగ్య సూత్రాలివే?

ఈరోజు మహాత్మగాంధీ పుట్టినరోజనే సంగతి తెలిసిందే.మహాత్మగాంధీ జీవించిన చివరి రోజు వరకు ప్రజలకు 5 ఆరోగ్య నియమాలను పాటించాలని సూచనలు చేశారు.

 5 Healthy Rules From Bapu You Shuld Follow For Healthy Life-TeluguStop.com

ఐదు ఆరోగ్య నియమాలను పాటించినన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటారని.తక్కువగా జబ్బుల బారిన పడతారని గాంధీజీ చెప్పారు.

గాంధీ ఎల్లప్పుడూ పాలిష్ చేయని బియ్యాన్నే తీసుకోవాలని సూచించారు.ప్రస్తుత కాలంలో పాలిష్ చేసిన బియ్యం మన జీవితంలో భాగమైపోయింది.

 5 Healthy Rules From Bapu You Shuld Follow For Healthy Life-వ్యాధులు రాకుండా ఉండేందుకు గాంధీ చెప్పిన ఆరోగ్య సూత్రాలివే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పాలిష్ చేసిన బియ్యం రుచిగా ఉండటంతో పాటు అన్నం తెల్లగా కనిపిస్తుంది.అందువల్లే మనం పాలిష్ చేసిన బియ్యం తినడానికి ఇష్టపడతాం.అయితే పాలిష్ చేయని బియ్యంలోనే శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి.గాంధీజీ చక్కెర వినియోగించడం బెల్లాన్ని ఎక్కువగా వినియోగించడం మంచిదని సూచనలు చేశారు.

సాధారణంగా చక్కెరను కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తారు.

చక్కెర ఎక్కువగా వినియోగించేవారు డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల చక్కెర బదులుగా బెల్లం వినియోగిస్తే మంచిది.టీ లేదా కాఫీ ద్వారా బెల్లం తీసుకుంటే ఆరోగ్యం లభిస్తుంది.

గాంధీజీ ఉడికించిన కూరగాయలతో పోలిస్తే పచ్చివి తీసుకుంటే మంచిదని చెప్పారు.పచ్చికూరగాయలతో సలాడ్ తయారు చేసుకుని తీసుకోవచ్చు.

గాంధీజీ సేంద్రీయ పద్ధతిలో పండించిన వాటితోనే ఆహారం తయారు చేసుకోవాలని చెప్పారు.

ప్రస్తుత కాలంలో కూరగాయలను పండించటానికి కెమికల్స్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

కెమికల్స్ వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.సేంద్రీయ పద్ధతిలో తయారు చేసిన ఆహారం వలన పోషకాలు లభిస్తాయి.

జామపండు గింజలు, వేప విత్తనాలు తీసుకున్నా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.గాంధీ ఈ ఆరోగ్య నియమాలను స్వయంగా పాటించేవారు.

తాను పాటించి ప్రజలను ఈ నియమాలను పాటించాలని సూచనలు చేసేవారు.ఈ ఆరోగ్య నియమాలను పాటించడం వల్లే గాంధీ ఆరోగ్యకరమైన జీవనం సాగించారు.

#Healthy Life #Food Habits #Healthy Tips #Gandhiji

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు