తెలుగు ఇండస్ట్రీని మార్చేసిన సినిమాలు

పౌరాణికాలతో మొదలుపెట్టి, పగలు ,ఫ్లాష్ బ్యాక్,ఫ్యాక్షనిజం,మాఫియా వరకు .తెలుగు సినిమా తెలుగు సినిమాతోనే పోటిపడింది.మధ్యమధ్యలో మాయబజార్, అల్లూరి సీతరామరాజు,స్వాతిముత్యం,శంకరాభరణం లాంటి చిత్రాలు మనవాళ్ళ టాలెంట్ ఏంటో దేశవ్యాప్తంగా తెలియజేశాయి.1990 .ఈ దశాబ్దపు చివర్లో మొదలైంది .ఫక్తు కమర్షియల్ సినిమాల సందడి.

 5 Films That Have Changed Telugu Industry-TeluguStop.com

చంపడం,నరకడం,హింస,హీరోయిన్ల అందాల ఆరబోత… ఇవన్ని సమపాళ్ళలో కలిపేస్తే అదే సినిమా.కథ కన్నా హీరోనే పెద్ద అనుకున్న రోజులవి.గత ఒకటి రెండు సంవత్సరాల వరకు కూడా అంతే.

ఇప్పుడ తెలుగు సినిమా చాలావరకు మారిపోయింది.

ఎలా తీయాలో అలా తీస్తే, ఎంత కొత్తరకమైన సినిమానైనా ఆదరిస్తామని నిరూపించారు తెలుగు ప్రేక్షకులు.జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ సినిమాలు మనదగ్గర కూడా వస్తున్నాయి

బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన సందర్భాన్ని పురస్కరించుకోని , ప్రముఖ బాలివుడ్ వెబ్ మ్యాగజీన్ “బాలివుడ్ లైఫ్” ప్రత్యేక కథనాన్ని రాసింది.

ఇందులో అయిదు తెలుగు సినిమాలు ఈ మార్పుకి కారణం అని తెలియజేసింది.ఆ అయిదు తెలుగు సినిమాలు , బాహుబలి,1-నేనొక్కడనే, మనం,ఊపిరి మరియు క్షణం

బాహుబలి .ఒక తెలుగు సినిమా బాలివుడ్ ఖాన్లను సవాలు చేస్తుందని కలలో ఊహించడానికైనా సాహసించామా! కట్టిపడేసే గ్రాఫిక్స్‌ విన్యాసాలతో కేవలం తెలుగువాళ్ళే కాదు … దేశప్రజలంతా గర్వపడేలా చేసింది ఈ సినిమా.అందుకే జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది

మహేష్ బాబు లాంటి అగ్రకథానాయకుడు, తన అభిమాన గణాన్ని, ప్రేక్షకులు తన నుంచి కోరుకునే అంశాలన్ని పక్కనపెట్టి 1-నేనొక్కడినేలో నటించాడు.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బోల్తపడ్డా .అంతర్జాతీయంగా గుర్తింపు సాధించింది.ఇందులో మహేష్ బాబు నటన నభూతో .న భవిష్యత్

మనం, ఊపిరి .ఇలా సరికొత్త కథలతో గుండెల్ని పిండేయడం నాగార్జునకే చెల్లింది.ఇక క్షణం.

కంప్లీట్ గా న్యూ ఏజ్ సినిమా.సరికొత్త కథ, కథనంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది

ఈ మార్పు అత్యవసరం .ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే మరిన్ని అద్భుతాలు చూడొచ్చు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube