పెళ్ళయిన మహిళపై ఐదుగురు ఫాదర్ల అత్యాచారం       2018-06-27   00:52:37  IST  Raghu V

తాము చేసిన పాపం దేవుడి సన్నిధిలో చెప్పుకుంటే పోతుందని భావించే భక్తులు దేవుడికి అన్ని విషయాలు చెప్తారు. ఇదే రీతిలో ఒక మహిళా పెళ్ళికి ముందు చేసిన ఒక తప్పుని పొరపాటున బయటపెట్టిన పాపానికి ఐదుగురు ఫాదర్లు ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు..ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టించింది..దేవుడిని నమ్ముకున్న ఆ మహిళని దేవుడి పేరుతో ఆ కీచక ఫాదర్లు చేసిన అకృత్యం వెలుగులోకి వచ్చింది వివరాలలోకి వెళ్తే.

తిరువళ్లకు చెందిన వివాహిత పెళ్లికి ముందు ఓ ఫాదర్‌తో సన్నిహితంగా గడిపింది..అయితే తానూ చేసిన తప్పుని ఆమె పెళ్ళయిన తరువాత పదే పదే తలుచుకుంటూ కుమిలిపోయేది అయితే జీసస్ ఎదుట చెప్పుకుని పరిహారం చేసుకోవాలని అనుకున్న ఆమె చర్చికి వచ్చి చెప్పుకుంది అయితే ఆమె యొక్క బలహీనతను అదునుగా చూసుకున్న ఆ ఫాదర్ ఆమెపై అత్యాచారం చేశాడు..

అయితే ఆమెతో ఉన్న అసభ్యకరమైన వీడియోలు ఫోటోలు మరో ఫాదర్‌కు పంపాడు. ఇలా పరస్పరం వీడియోలు, ఫొటోలు పంపుకొన్న ఫాదర్లు..వాటిని చూపిస్తూ ఆమెని బెదిరించ సాగారు..ఆపై వరుసగా ఒకరికి ఒకరి అత్యాచారం చేశారు.. అయితే గత ఫిబ్రవరిలో తన భార్య మెయిల్‌కు ఓ హోటల్‌కు సంబంధించిన భారీ బిల్లు రావడంతో అనుమానించిన భర్త నిలదీసే సరికి బాధితురాలు జరిగిన ఘోరాన్ని వెల్లడించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐదుగురు ఫాదర్లను చర్చి నిర్వహణ కమిటీ సస్పెండ్‌ చేసింది. ఆమె భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు..