రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఏం చేయాలి?  

మన శరీరం ఏ పని చేసినా అది రక్తం వల్లనే. మన ఊపిరి పీల్చుకోవానుకున్నా సరే, రక్తం అవసరమే. రక్తం లేనిదే జీవనం లేదు. ఈ విషయాలు మీకు తెలియనివి కావు. అయితే రక్తంలో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్త కణాలు. రెండూ అవసరమే. రెండిట్లో ఏది తక్కువైనా ఇబ్బందులు తప్పవు. ఈరోజుకైతే ఎర్రరక్తకణాల గురించి మాట్లాడుకుందాం. ఎర్ర రక్తకణాలు ఎందుకు ఎర్రగా ఉంటాయంటే హిమోగ్లోబిన్ ఉండటం వలన. ఈ హిమోగ్లోబిన్ ఎందుకు అవసరం అంటే అదే మన ఒంట్లోకి ప్రాణవాయువుని తీసుకెళ్ళేది. మరి మన శరీరభాగాలకు ప్రాణవాయువు బాగా అందాలంటే హిమోగ్లోబిన్ శాతం సారిపడా ఉండాలి కదా. అలా ఉండాలంటే ఇవి అలవాటు చేసుకోండి.

* చాలా సింపుల్ … రోజు వాకింగ్ చేయండి. ఏరోబిక్ వ్యాయామాలలో ఒదటి వ్యాయయం ఇదేగా. వాకింగ్ వలన శరీరంలో జరిగే మూమెంట్స్ తో బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. దాంతో పాటే హిమోగ్లోబిన్ శాతం కూడా పెరిగిపోతుంది. దూరాలు నడిచే అలవాటు లేకపోతే, పొద్దున్న లేవడానికి బద్ధకంగా అనిపిస్తే లిఫ్ట్, ఎలివేటర్ కి బదులు మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. అలాంటి చిన్నిపాటి నడకలు కూడా శరీరానికి మంచివే.

* డ్యాన్స్ చేయడం వలన కూడా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చు. ఎలాంటి స్టయిల్ ఆఫ్ డ్యాన్స్ ఎంచుకున్న పర్వాలేదు. డ్యాన్స్ కూడా ఏరోబిక్ వ్యాయామాల కిందికే వస్తుంది. అయితే మొదటినుంచి డ్యాన్స్ అలవాటు లేనివాళ్ళు ముందుగా లైట్ ఫాం డ్యాన్స్ తో మొదలుపెడితే మేలు.

* సైకిల్ తొక్కడం కూడా మంచి ఏరోబిక్ వ్యాయామమే. చిన్న చిన్న దూరాలకు బైక్, కారుకి బదులు సైకిల్ వాడండి. కొన్ని దేశాల్లో ఒకరోజు సైకిల్ తప్ప ఇంకేమి వాడకూడదు అని నిశ్చయించుకుంటారు తెలుసా. ఆ ఒక్కరోజైనా కాలుష్యం తగ్గించుకొని ఆరోగ్యం పెంచుకోవాలనే ఆలోచన అది.

* ఈత కొట్టం కూడా మంచి ఏరోబిక్ వ్యాయామమే. మీరేమి గజఈతగాడిలాగా రౌండ్లు వేయక్కరలేదు. క్యాజువల్ గా చేసే స్విమ్మింగ్ కూడా రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవడానికి కారణమవుతుంది. రోజుకి ఓ గంట స్విమ్మింగ్ పూల్ లో లేదా నీటి బావిలో గడిపేలా చూసుకోండి.

* భారిగా పరుగులు తీయక్కరలేదు. చిన్నగా జాగింగ్ చేసినా సరిపోతుంది. రన్నింగ్ చెమట కక్కేలా చేస్తుంది. కాలరీలు తగ్గించి రెడ్ బ్లడ్ సెల్స్ పెంచుతుంది. ఒకవేళ బయట ఎండగా ఉంటే ఇంట్లోనే ట్రేడ్ మిల్ వాడండి.