చిటికెలో తలనొప్పిని తగ్గించే అద్భుతమైన ఆయిల్స్  

5 Effective Essential Oils For Headaches -

వయస్సుతో సంబంధం లేకుండా తలనొప్పి వస్తుంది.తలనొప్పి వచ్చిందంటే విపరీతమైన చిరాకు వస్తుంది.

తలనొప్పి అనేది ఒత్తిడి,విపరీతమైన ఆలోచనల కారణంగా వస్తుంది.ఒత్తిడి పెరిగే కొద్ది తలనొప్పి కూడా పెరుగుతుంది.

5 Effective Essential Oils For Headaches-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

సాధారణంగా తలనొప్పి రాగానే ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం.ఆలా కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స‌హజ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు.

దాని కోసం మనకు ఎన్నో రకాల ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

యూక‌లిప్ట‌స్ ఆయిల్‌
నాలుగు చుక్క‌ల యూకలిప్ట‌స్ ఆయిల్‌ను తీసుకుని నుదురు, క‌ణ‌త‌లపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.దీంతో త‌ల‌నొప్పి తలనొప్పి తగ్గటమే కాకుండా ఒత్తిడి కూడా దూర‌మ‌వుతుంది.

చామంతి పూల నూనె
చామంతి పూల నూనెలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన తలనొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది.నాలుగు చుక్కల చామంతి పూల నూనెను తీసుకోని నుదురు, క‌ణ‌త‌లపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.

దీంతో తలనొప్పి తగ్గటమే కాకుండా ఒత్తిడి కూడా దూర‌మ‌వుతుంది.

పెప్ప‌ర్‌మింట్ ఆయిల్‌
పెప్ప‌ర్‌మింట్ ఆయిల్‌ లో త‌ల‌నొప్పిని నివారించే యాంటీ స్పాస్మోడిక్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.

దీంతో ఆందోళ‌న కూడా త‌గ్గుతుంది.కొద్దిగా పెప్ప‌ర్‌మింట్ ఆయిల్‌ను తీసుకుని నుదుటిపై, క‌ణ‌త‌ల‌కు సున్నితంగా మ‌ర్ద‌న చేస్తే చాలు త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది.

రోజ్‌మేరీ ఆయిల్‌
2 చుక్క‌ల రోజ్‌మేరీ ఆయిల్‌, 1 టీస్పూన్ కొబ్బ‌రినూనెలను బాగా కలిపి నుదుటిపై, క‌ణ‌త‌ల‌కు సున్నితంగా మ‌ర్ద‌న చేస్తే చాలు త‌ల‌నొప్పి ఇట్టే త‌గ్గిపోతుంది.ఈ ఆయిల్ లో అనాల్జెసిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉండుట వలన తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ల‌వంగ నూనె
రెండు చుక్క‌ల ల‌వంగ నూనెను వేలిపై వేసుకుని ఆ నూనెను నుదుటిపై బాగా రాసి మసాజ్ చేయాలి.ఈ ఆయిల్ లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు సమృద్ధిగా ఉండుట వలన త‌ల‌నొప్పిని తగ్గించటమే కాకుండా ఆందోళ‌నను కూడా తగ్గిస్తాయి.

తాజా వార్తలు