సౌందర్య పోషణలో కీలక పాత్ర పోషించే డ్రై ఫ్రూట్స్     2017-10-01   22:10:35  IST  Lakshmi P

సాధారణంగా డ్రై ఫ్రూట్స్ తింటే మన ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాం. కానీ మన అందాన్ని రెట్టింపు చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తుందంటే నమ్ముతారా? అవును డ్రై ఫ్రూట్స్ ని ఉపయోగించి మన ముఖాన్ని అందంగా చేసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

బాదం
బాదం పప్పులను పొడి చేసి నీటిలో నానబెట్టి పాలలో కలిపి మెత్తని పేస్ట్ గా చేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలో రిస్వెరట్రాల్ అనే యాంటీ యాక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన చర్మ ఆరోగ్యంలో సహాయపడుతుంది. చర్మం ముడతలు పడకుండా అడ్డుకుంటుంది.