హానికరమైన కెమికల్స్ ఉండే కూల్ డ్రింక్స్ లిస్టు ఇదిగో     2016-11-23   01:57:13  IST  Raghu V

కూల్ డ్రింక్స్ లో కెమికల్స్ కలవడం అనేది ఈనాటి టాపిక్ కాదు. ఏళ్ళుగా కూల్ డ్రింక్స్ కంపెనీల మీద విరుచుకుపడుతున్నారు మెడికల్ నిపుణులు, న్యూట్రిశన్ నిపుణులు. కొంచెం ఆలస్యమైనా, భారత ప్రభుత్వం వారి మాట విన్నట్టు ఉంది. తాజాగా కొన్ని ఫేమస్ కూల్ డ్రింక్స్ కంపెనీల్లో కేడ్మియం, క్రోమియం లాంటి హానికరమైన పదార్థాలు కలిసి ఉన్నట్లు ఒప్పుకుంది భారత ప్రభుత్వం. అయితే ప్రత్యేకంగా ఆ కంపెనీల పేర్లు కాని ప్రాడక్ట్స్ పేర్లు కాని బయటకి చెప్పలేదు.

కాని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) రిపోర్టుల ప్రకారం, Pepsi, 7UP, Mountain Dew, Cocacola మరియు Sprite అనే అయిదు ప్రాడక్ట్స్ లో ఈ ఎలిమెంట్స్ కలుపుతున్నారట. ఈ అయిదు ప్రాడక్ట్స్ లో పెప్సీ,7 అప్, మౌంటేన్ డ్యూ పెప్సీ కంపెని యొక్క ప్రాడక్ట్స్ కాగా, మిగితా రెండు ప్రాడక్ట్స్ అయిన కోకోకోలా మరియు స్ప్రయిట్ కోకోకోలా కంపెనీ ప్రాడక్ట్స్.

ఆ కూల్ డ్రింక్స్ ఎందుకు ప్రమాదమో గుర్తించారు. మరి వాటిని బ్యాన్ చేస్తారా లేక అంత పెద్ద కంపెని ఒనర్లకు తలొగ్గి మూడురోజులు చర్చలు జరిపి మర్చిపోతారా చూడాలి.