శృంగారం అందాన్ని పెంచుతుందా ? తగ్గిస్తుందా ?

శృంగారం అనే ఒక పని, మన జీవితంలో ఎన్నివిధాలుగా పనికివస్తుందో ! ఇటు భాగస్వాముల మధ్య అనోన్యత, ప్రేమ పెంచే సాధనం అదే, ఇద్దరి కోరికలు తీర్చేది అదే, శారీరాక లాభాలు , చివరకి భాగస్వాముల మధ్య ప్రేమగా ఓ గుర్తుని అందించేది అదే.శృంగారం వలన ఇన్ని అన్ని అని కాదు, ఎన్నో లాభాలు ఉన్నాయి.

 5 Beauty Benefits Regular $ex Can Give-TeluguStop.com

కాలరీలు ఖర్చు అవుతాయి, హాయి హార్మోన్లు విడుదల అవుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది .ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి.కాని శృంగారం వలన అందం కూడా మెరుగుపడుతుంది తెలుసా ? శృంగారం మన ముఖారవిందాన్ని కూడా పెంచుతుంది.

పోర్న్ స్టార్స్ అంత అందంగా ఉండటానికి రెగ్యులర్ శృంగారం బలమైన కారణం అని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ విషయాన్ని పోర్న్ స్టార్స్ కూడా ఒప్పుకుంటున్నారు.అయినా డాక్టర్లే ఒప్పుకున్నాక పోర్న్ స్టార్స్ ఎందుకు ఒప్పుకోరు.

రెగ్యులర్ గా శృంగారం చేసే వాళ్ళు యవ్వనంగా కనబడతారు, అంత త్వరగా వయసు అయిపోయినట్టుగా అనిపించరు, చర్మం లేతగా మారుతుంది, ముఖం రంగులో మార్పు కనిపిస్తుంది.ఇలా చెబితే మీకు నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు కాని, మీకు అర్థమయ్యేలా డీటేల్స్ అని చెప్పాల్సిందే.శృంగారం వలన ఎలాంటి లాభాలు మన చర్మానికి దొరుకుతాయో, ఎలా దొరుకుతాయో … ఆ లాభాలేంటో … అవన్నీ చెబుతున్నాం చూడండి.

1) మంచి నిద్ర = అందం

శృంగారం వలన లేదా హస్తప్రయోగం వలన మంచి నిద్ర పడుతుందని ఇప్పటికే చాలాసార్లు చదువుకున్నాం.ఇక మంచి నిద్ర వలన అందం పెరుగుతుందని కూడా చదువుకున్నాం.మనం మామూలుగా మధ్యాహ్నం పడుకునే అలవాటు చేసుకుంటే బయట ఫ్రెండ్స్ “గ్లామర్ కోసమా” అని సరదాగా అంటుంటారు.

వాళ్ళు సరదాగా అన్న, అది నిజమే.అంటే మధ్యాహ్నం నిద్రపోతేనే అందం పెరుగుతుందని కాదు, మంచి నిద్ర వలన అందం పెరుగుతుంది.

రోజుకి 7-8 గంటలు నిద్రతీస్తున్నవారి ముఖాలను ఓసారి గమనించండి, అలాగే రోజుకి నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోయేవారి ముఖాలను చూడండి.ఎంత తేడా కనిపిస్తుందో ! శృంగారం వలన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.

ఈ హార్మోన్ బాగా విడుదల అవడం వలన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది.దాంతో ఈజీగా నిద్రపడుతుంది.

అలాగే ఎక్కువసేపు నిద్రపోతారు.దాంతో మీ అందం పెరుగుతుంది.

ఇది మేం చెబుతున్న మాట కాదు, డాక్టర్ నికోలస్ సివేకింగ్ చెబుతున్న మాట.ఆయనొక సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్.సెక్స్, నిద్ర, అందం … ఈ మూడిటికి ఎంత దగ్గరి సంబంధం ఉందొ అనే విషయం మీద ఆయన పరిశోధనలు చేసారులెండి.

2) ముఖం రంగు తేలుతుంది

శృంగారం శరీరంలో రక్త ప్రసరణ బాగా పెంచుతుంది అని చెప్పుకున్నాం.శృంగారం వలన కలిగే ఇదో అదనపు లాభం.ఈ అదనపు లాభం వలన దొరికే మరో అదనపు లాభం ఏమిటంటే, శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగితే, ముఖం రంగు తేలుతుంది.

పూర్తిగా జేన్యున్ రంగుని మార్చడం కష్టం కాని చామనచాయ ఉన్నవారిలో మాత్రం మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది.ఈ విషయం కూడా మేం చెబుతున్నది కాదు, డాక్టర్ జోల్ స్లింగర్ చెబుతున్నది.

ఈయనొక సర్టిఫైడ్ డెర్మటాలాజిస్ట్.అంటే ఏంటో తెలుసుగా ? చర్మ సమస్యల సంబంధిత డాక్టర్.స్వయంగా ఆయనే చెప్పారు .శృంగారం వలన బ్లడ్ సర్కిలేషన్ మెరుగుపడుతుంది అని, తాద్వారా ముఖం రంగు బాగా తేలుతుందని.అదేలా అని మీకు సందేహం ఉండవచ్చు.చాలా సింపుల్ అండి .బ్లడ్ సర్కిలేషన్ మెరుగుపడింది అంటే ఒంట్లో భాగాలకి ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది.రక్తం, ఆక్సిజన్, రెండూ బాగా అందే సరికి మన చర్మం యొక్క రంగు మారిపోతూ ఉంటుంది.

కాబట్టి, మార్కెట్ లో దొరికే క్రీమ్స్ పడేసి, మంచం మీద కష్టపడండి .కొన్నిరోజుల్లో మార్పు మీరే చూస్తారు.

3) స్ట్రెస్ లేని ముఖం యొక్క కళ వేరు

వారం రోజులుగా దిగాలుగా ఉన్నవారి ముఖాన్ని ఓసారి చూడండి, వారం నుంచి తృప్తిగా, నవ్వుకుంటూ ఉన్నవారి ముఖాన్ని చూడండి .ఎవరు ఎక్కువ అందంగా కనిపిస్తారు ? ఎలాగో నవ్వుకుంటూ ఉన్నవారు అందంగా ఉంటారని మీరు అంటారు.మరి వాళ్ళే ఎందుకు అందంగా ఉన్నారు, బాధలో ఉన్నవారు ఎందుకు లేరు అంటే సింపుల్ గా స్ట్రెస్ లో ఉన్నారు కాబట్టి అని చెప్పొద్దూ.సైన్స్ ప్రకారం చెబితే, అది హార్మోన్స్ ప్రభావం .మనం బాధలో ఉన్నప్పుడు విడుదల అయ్యే హార్మోన్స్ వేరు, హాయిలో ఉన్నప్పుడు విడుదల అయ్యే హార్మోన్స్ వేరు.అందుకే ఈ తేడా.

ఈ స్ట్రెస్ ని పోగొట్టి, ముఖాన్ని కాంతివంతంగా మార్చుకునే ఆయుధమే సెక్స్.ఎందుకంటే ఇది హాయిని కలిగించే హార్మోన్స్ ని ఒంట్లో ఉత్పత్తి చేస్తుంది.

ఆడవారిలో చెప్పాలంటే, శృంగారం తరువాత వారిలో విడుదలయ్యే ఈస్త్రోజేన్ కల్లోజేన్ లెవల్స్ ని పెంచుతుంది.దీంతో వారి అందం పెరుగుతుంది ఈ విషయం కూడా ఊరికే మేం చెప్పింది కానే కాదు … క్లినికల్ సైకాలజీస్ట్ ఎలిజబెత్ లోమ్బార్డో చెప్పినది.

ఆవిడ మానసిక సమస్యలతో తన దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరికి శృంగారం చేయమనే సలహా ఇస్తుందట.ఎందుకంటే, మనిషికి భరించలేని ఆనందాన్ని కలిగించేది శృంగారమే కదా.శృంగారం మన సంతోషాన్ని, అందాన్ని పెంచుతుంది అనేది కాదనలేని వాస్తవం.

4) భావప్రాప్తి మీ శరీరంలో చేసే మార్పులే వేరు

ఎవరైనా శృంగారం ఎందుకు చేస్తారు ? భావప్రాప్తి పొందడానికే కదా.భావప్రాప్తి ఎందుకు కావాలి ? ఒరకమైన హాయి, సంతృప్తి పొందడానికే కదా.ఆ భావప్రాప్తి మీ శరీరంలో ఎన్నో మార్పులని తీసుకొస్తుంది.ఆ మార్పుల వలన మీ చర్మం కూడా ఎంతగానో లాభపడుతుంది.భావప్రాప్తి పొందినప్పుడు అది స్త్రీ శరీరమైనా, పురుషుడి శరీరమైనా, ఆక్సిటాసిన్ అనే హార్మోన్ విడుదలై, అది కోర్తిసాల్ అనే మరో హార్మోన్ రేటుని తగ్గిస్తుంది.

మన శరీర నిర్మాణం ఎలాంటిది అంటే, కోర్టిసాల్ తగ్గితే తప్ప, మన చర్మ ఆరోగ్యం మేరుగుపడదు.ఈరకంగా భావప్రాప్తి కోర్టిసాల్ ని తగ్గించి, మన చర్మం యొక్కరంగుని మెరుగుపరచడమే కాకుండా, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి, ముడతలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.

అలాగే మొటిమలు లాంటి సమస్యని తగ్గిస్తుంది.హస్తప్రయోగం లేదా శృంగారం వలన మొటిమలు పెరుగుతాయి అనేది కేవలం ఒక అపోహా మాత్రమే.నిజానికి శృంగారం వలన అక్నే తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.ఇది చర్మం యొక్క రంధ్రాలను శుభ్రం చేయడం వలన ఇలా జరుగుతుంది.అలాగే శృంగారం కురులని కూడా ఆరోగ్యవంతంగా మారుస్తుందని డాక్టర్లు చెబుతారు.

5) చర్మంపై పట్టింపు

వినడానికి సిల్లిగా అనిపిస్తూ ఉండవచ్చు కాని, శృంగారం మన చర్మం మీద మనకు పట్టింపు పెరిగేలా చేస్తుంది.మన ముఖం అందంగా ఉండాలని, చర్మం లేతగా, కాంతివంతంగా ఉండాలని ఎందుకు కోరుకుంటాం ? భాగస్వామికి మన మీద ఆసక్తి పుట్టాలనే కదా.రెగ్యులర్ శృంగారం వలన మనకు దొరికే లాభమే అది.రెగ్యులర్ గా శృంగారం చేస్తూ ఉంటే, మన భాగస్వామికి మన ఇంకా ఆకర్షణీయంగా కనబడాలనే కోరిక పెరుగుతుంది.దాంతో మన శరీరం మీద బెంగ పెరుగుతుంది .ఇది ఓరకంగా మంచిదే.బెంగ పెరిగినప్పుడే పట్టింపు పెరిగేది.

అప్పుడే కదా జనాలు అందం మీద శ్రద్ధ చూపేది.యూకేలో జరిగిన ఓ సర్వేనే దీనికి సాక్ష్యం … ముఖాన్ని ఎలా అందంగా మార్చుకోవాలో, ఏం తినాలో, ఏమి తినకూడదో, ఎలాంటి అలవాట్లు అందాన్ని చేడగోడతాయో, పెళ్ళి ఫిక్స్ అయ్యే దాకా తాము చదవలేదు అని 85% మంది బల్లగుద్ది చెప్పారు ఆ సర్వేలో.

అందుకే శృంగారం అందం మీద శ్రద్ధ పెంచుతుంది అని చెప్పేది.అసలు శృంగారం లేకపోతే, శరీర భాగాల అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే కోరిక పుడుతుంది మనకు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube