శృంగారం అందాన్ని పెంచుతుందా ? తగ్గిస్తుందా ?     2018-03-08   20:36:08  IST  Raghu V

శృంగారం అనే ఒక పని, మన జీవితంలో ఎన్నివిధాలుగా పనికివస్తుందో ! ఇటు భాగస్వాముల మధ్య అనోన్యత, ప్రేమ పెంచే సాధనం అదే, ఇద్దరి కోరికలు తీర్చేది అదే, శారీరాక లాభాలు , చివరకి భాగస్వాముల మధ్య ప్రేమగా ఓ గుర్తుని అందించేది అదే. శృంగారం వలన ఇన్ని అన్ని అని కాదు, ఎన్నో లాభాలు ఉన్నాయి. కాలరీలు ఖర్చు అవుతాయి, హాయి హార్మోన్లు విడుదల అవుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది .. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. కాని శృంగారం వలన అందం కూడా మెరుగుపడుతుంది తెలుసా ? శృంగారం మన ముఖారవిందాన్ని కూడా పెంచుతుంది.

పోర్న్ స్టార్స్ అంత అందంగా ఉండటానికి రెగ్యులర్ శృంగారం బలమైన కారణం అని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని పోర్న్ స్టార్స్ కూడా ఒప్పుకుంటున్నారు. అయినా డాక్టర్లే ఒప్పుకున్నాక పోర్న్ స్టార్స్ ఎందుకు ఒప్పుకోరు. రెగ్యులర్ గా శృంగారం చేసే వాళ్ళు యవ్వనంగా కనబడతారు, అంత త్వరగా వయసు అయిపోయినట్టుగా అనిపించరు, చర్మం లేతగా మారుతుంది, ముఖం రంగులో మార్పు కనిపిస్తుంది. ఇలా చెబితే మీకు నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు కాని, మీకు అర్థమయ్యేలా డీటేల్స్ అని చెప్పాల్సిందే. శృంగారం వలన ఎలాంటి లాభాలు మన చర్మానికి దొరుకుతాయో, ఎలా దొరుకుతాయో … ఆ లాభాలేంటో … అవన్నీ చెబుతున్నాం చూడండి.

1) మంచి నిద్ర = అందం

శృంగారం వలన లేదా హస్తప్రయోగం వలన మంచి నిద్ర పడుతుందని ఇప్పటికే చాలాసార్లు చదువుకున్నాం. ఇక మంచి నిద్ర వలన అందం పెరుగుతుందని కూడా చదువుకున్నాం. మనం మామూలుగా మధ్యాహ్నం పడుకునే అలవాటు చేసుకుంటే బయట ఫ్రెండ్స్ “గ్లామర్ కోసమా” అని సరదాగా అంటుంటారు. వాళ్ళు సరదాగా అన్న, అది నిజమే. అంటే మధ్యాహ్నం నిద్రపోతేనే అందం పెరుగుతుందని కాదు, మంచి నిద్ర వలన అందం పెరుగుతుంది. రోజుకి 7-8 గంటలు నిద్రతీస్తున్నవారి ముఖాలను ఓసారి గమనించండి, అలాగే రోజుకి నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోయేవారి ముఖాలను చూడండి. ఎంత తేడా కనిపిస్తుందో ! శృంగారం వలన ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ బాగా విడుదల అవడం వలన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. దాంతో ఈజీగా నిద్రపడుతుంది. అలాగే ఎక్కువసేపు నిద్రపోతారు. దాంతో మీ అందం పెరుగుతుంది. ఇది మేం చెబుతున్న మాట కాదు, డాక్టర్ నికోలస్ సివేకింగ్ చెబుతున్న మాట. ఆయనొక సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. సెక్స్, నిద్ర, అందం … ఈ మూడిటికి ఎంత దగ్గరి సంబంధం ఉందొ అనే విషయం మీద ఆయన పరిశోధనలు చేసారులెండి.

2) ముఖం రంగు తేలుతుంది

శృంగారం శరీరంలో రక్త ప్రసరణ బాగా పెంచుతుంది అని చెప్పుకున్నాం. శృంగారం వలన కలిగే ఇదో అదనపు లాభం. ఈ అదనపు లాభం వలన దొరికే మరో అదనపు లాభం ఏమిటంటే, శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగితే, ముఖం రంగు తేలుతుంది. పూర్తిగా జేన్యున్ రంగుని మార్చడం కష్టం కాని చామనచాయ ఉన్నవారిలో మాత్రం మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ విషయం కూడా మేం చెబుతున్నది కాదు, డాక్టర్ జోల్ స్లింగర్ చెబుతున్నది. ఈయనొక సర్టిఫైడ్ డెర్మటాలాజిస్ట్. అంటే ఏంటో తెలుసుగా ? చర్మ సమస్యల సంబంధిత డాక్టర్. స్వయంగా ఆయనే చెప్పారు .. శృంగారం వలన బ్లడ్ సర్కిలేషన్ మెరుగుపడుతుంది అని, తాద్వారా ముఖం రంగు బాగా తేలుతుందని. అదేలా అని మీకు సందేహం ఉండవచ్చు. చాలా సింపుల్ అండి .. బ్లడ్ సర్కిలేషన్ మెరుగుపడింది అంటే ఒంట్లో భాగాలకి ఆక్సిజన్ కూడా బాగా అందుతుంది. రక్తం, ఆక్సిజన్, రెండూ బాగా అందే సరికి మన చర్మం యొక్క రంగు మారిపోతూ ఉంటుంది. కాబట్టి, మార్కెట్ లో దొరికే క్రీమ్స్ పడేసి, మంచం మీద కష్టపడండి .. కొన్నిరోజుల్లో మార్పు మీరే చూస్తారు.