సాధారణంగా ఒక జంటకి పెళ్లి చేయాలంటే ఈడు, జోడు చక్కగా ఉంటేనే పెళ్లి చేస్తారు.ఆ వధూవరుల జంటను చూసి చూడముచ్చటగా ఉన్నారనెలా వధూవరులను వెతికి పెళ్లిళ్లు చేస్తుంటారు.
ఈ కరోనా సమయంలో ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎన్నో పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి.ఇలా కరోనా సమయంలో జరిగిన పెళ్లిళ్లు కొన్ని ఆసక్తికరంగా మారాయి.
ఇలాంటి ఆసక్తికరమైన పెళ్లిళ్లలో గుజరాత్ లో జరిగిన ఈ వివాహం ఒకటి.ప్రస్తుతం ఈ వివాహం ఒకటి చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్ లోని జూనాగఢ్ లో జరిగిన వివాహంలో వధువు 5.5 అడుగుల ఎత్తు ఉండగా, వరుడు మాత్రం 3 అడుగులు ఎత్తు ఉన్నారు.ఈ వివాహానికి సంబంధించిన కొంత సమాచారం మేరకు, వధువు పేరు శాంతా మక్వాణా(29) ఈమె పుట్టుకతోనే చూపును కోల్పోయింది.అయితే తనలో ఉన్న ఈ లోపం గురించి ఎప్పుడు నిరాశ పడకుండా, ఆత్మవిశ్వాసం తో ఒక హాస్టల్లో ఉండే చదువు పై శ్రద్ధ పెట్టింది.
శాంతా హాస్టల్లోనే ఉంటూ బీఈడీ కోర్సును పూర్తి చేసింది.
వరుడు విషయానికి వస్తే అతని పేరు రమేస్ భాయీ డాంగర్(42) సంవత్సరాలు.
అయితే రమేస్ వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.శాంతా మక్వాణా గురించి ఎవరి ద్వారానో తెలుసుకున్న రమేస్ ఆ యువతి ఉంటున్న హాస్టల్ దగ్గరకు వెళ్లి ఆమెకు ఇష్టమైతే తనని పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.
రమేస్ తో వివాహానికి ఆమె ఒప్పుకోవడంతో వీరి పెళ్లి నవంబర్ 30న ఎంతో ఘనంగా జరిగింది.వీరి పెళ్లికి వచ్చిన బంధువులు నిండు మనసుతో వీరిద్దరిని ఆశీర్వదించారు.
ప్రస్తుతం వీరి పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎంతో మంచి మనసుతో అతను ఆమెను పెళ్లి చేసుకోవడం పట్ల అందరూ ఆ వరుడి పై ప్రశంసల వర్షం కురిపించారు.