అమెరికా ఎన్నికల్లో నలుగురు భారతీయుల విజయం: విజేతల్లో ఒకరు హైదరాబాదీ

అమెరికాలో భారతీయులు మరోసారి సత్తా చాటారు.అక్కడ జరిగిన రాష్ట్ర, స్థానిక ఎన్నికల్లో ఒక ముస్లిం మహిళ సహా నలుగురు భారతీయులు విజయం సాధించారు.

 4indian Americans Win State Local Elections In America-TeluguStop.com

ఇండియన్ అమెరికన్ జాతీయురాలు గజాలా హష్మీ వర్జీనియా రాష్ట్ర సెనేట్ సభ్యురాలిగా ఘన విజయం సాధించారు.ఈమెది తెలుగు కుటుంబం.

గజాలా తల్లీదండ్రులు 50 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నుంచి వెళ్లి అమెరికాలోని జార్జియాలో స్ధిరపడింది.సదరన్ విశ్వవిద్యాలయం, ఎమోరీ వర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించారు.

వర్జీనియా కళాశాల, వర్జీనియా విశ్వవిద్యాలయాల్లో పాతికేళ్లకు పైగా గజాలా పనిచేశారు.ప్రస్తుతం రేనాల్డ్స్ కమ్యూనిటీ కాలేజీ, టీచింగ్ అండ్ లెర్నింగ్ ద సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో ఫండింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రాజకీయాలపై ఆసక్తితో డెమొక్రటిక్ పార్టీలో చేరి వర్జీనియా స్టేట్ సెనేట్ సభ్యురాలిగా విజయం సాధించారు.అంతేకాదు.ఆ రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా గజాలా హష్మీ రికార్డుల్లోకెక్కారు.

Telugu Indianamericans, American, America, Telugu Nri Ups-

ఇక బెంగళూరుకు చెందిన సుహాస్ సుబ్రమణ్యం లౌడన్ అండ్ ప్రిన్స్ విలియం జిల్లా నుంచి వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షునిగా ఉన్న కాలంలో హెల్త్, టెక్నాలజీ, వయో వృద్దుల సంక్షేమంపై సలహాదారునిగా పనిచేశారు.ఇక న్యాయ శాస్త్రంలో అపార అనుభవం ఉన్న మనోరాజు శాన్‌ఫ్రాన్సిస్కో పబ్లిక్ డిఫెండర్‌గా ఎన్నికయ్యారు.

విద్యార్ధిగా ఉన్నప్పుడు ఏ కార్యాలయంలో అయితే రాజు శిక్షణ పొందారో ఇప్పుడే అదే కార్యాలయానికి అధిపతిగా ఆయన వ్యవహరించనున్నారు.మరో భారతీయురాలు నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్ సిటీ కౌన్సిల్‌కు డింపుల్ అజ్మీరా రెండోసారి ఎన్నికయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube