1500 రూపాయలకి 4G ఫోన్

ఉచిత 4G ఇస్తూ, ఉచిత వాయిస్ కాల్స్ ఇస్తూ ఇప్పటికే టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియాలకు ముచ్చెమటలు పట్టించిన జియో, ఇప్పుడు మొబైల్ కంపెనీల మార్కెట్ ని కూడా దెబ్బతీసేందుకు సిద్ధపడుతోంది.ఇప్పటికే 3000 రూపాయలకు లైఫ్ 4G ఫోన్లు అందిస్తున్న జియో, ఇకనుంచి 1500 రూపాయలకి కూడా VoLTE ఫోన్లు అందించే కార్యక్రమం పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 4g Volte Mobiles To Be Available From 1500 Rupees-TeluguStop.com

మిగితా కంపెనీల దగ్గర VoLTE తో పనిచేసే మొబైల్స్ కొనాలంటే కనీసం 6-7 వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.2000 రూపాయల లోపే ఖర్చుపెట్టి మొబైల్స్ వాడే జనాభా కోట్లల్లో ఉంటుంది.ఇప్పుడు అందుకే, ఆ సెక్షన్ జనాభాని టార్గెట్ చేసేందుకే పదిహేను వందల రూపాయలకే 4G ఫోన్లు అందించే ప్లాన్ వేసింది.ఈ మొబైల్ కూడా LYF సీరిస్ భాగంగానే వస్తుంది.

ప్రస్తుతానికైతే ఈ మొబైల్ కి “LYF Easy” అనే పేరు పరిశీలిస్తున్నారట.త్వరలోనే జియో ఈ విషయాన్ని ప్రకటించవచ్చు.

ఇదే నిజమైతే, టెలికాం కంపెనీలతో పాటు, మొబైల్ కంపెనీలు కూడా రిలయన్స్ కి శత్రువులుగా మారిపోతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube