టెలికాం, స్మార్ట్‌ఫోన్స్( Telecom, Smartphones ) తయారీ రంగంలో జియో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది.ఇతర టెలికాం, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది.
జియో( jio ) రాకతో ఇండియాలో మొబైల్, టెలికాం రంగంలో పెను మార్పులు వచ్చాయి.ఇంతకుముందు డేటా, మొబైల్ ఫోన్ ధరలు భారీగా ఉండేవి.
సామాన్య, మధ్యతరగతి ప్రజలు మొబైల్ డేటాను ఉపయోగించుకోవాలంటే అధిక ధరలు ఉండేవి.అలాగే మొబైల్ ఫోన్ ధరలు కూడా భారీగా ఉండేవి.
కానీ జియో రాకతో మొబైల్ డేటా ఛార్జీలు, స్మార్ట్‌ఫోన్ మొబైల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి.

తాజాగా జియో మరో సంచలనానికి వేదికైంది.4జీ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది.ఈ హ్యాండ్‌సెట్‌కు ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా కల్పించింది.కేవలం రూ.999కే ఈ మొబైల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.ఇటీవల 4జీ వినియోగం బాగా పెరిగిపోయింది.
ప్రస్తుతం ఎక్కువమంది దగ్గర 4జీ సపోర్ట్ చేసే ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి.అందుకే ఈ 4జీ ఇంటర్నెట్( 4G internet ) ఆధారిత మొబైల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చినట్లు జియో చెబుతోంది.
అయితే ఈ మొబైల్ కొనుగోలు చేసినవారికి మరో ఆఫర్ కూడా ఇవ్వనుంది.అదేంటంటే.కేవలం రూ.123 రీఛార్జ్‌తో 28 రోజుల అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 14 జీబీ డేటాను అందించనుంది.

ఇతర సర్వీస్ ప్రొవైడర్ల కంటే 30 శాతం అతి తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్నట్లు జియో స్పష్టం చేసింది.ఇక వన్ ఇయర్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది.రూ.1234 రీఛార్జ్ ప్లాన్‌తో 168 జీబీ డేటా లభిస్తుంది.ఒక ఏడాది పాటు దీనికి ఉపయోగించుకోవచ్చు.
ఈ నెల 7వ తేదీ నుంచి ఈ ఫోన్ అమ్మకాలను జియో ప్రారంభించనుంది.ఇందుకోసం 10 లక్షల ఫోన్లను సిద్దం చేసింది.