వైరల్ వీడియో: నాలుగు అడుగుల పామును మింగేసిన యువతి!

మనలో చాలా మందికి పాము పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.పామును చూస్తే చాలు కాళ్లూచేతులు గజగజా వణుకుతాయి.

 4ft Snake Is Pulled From A Russian Woman's Throat,snake, Woman Throat, Russia, 4-TeluguStop.com

అయితే ఒక యువతి మాత్రం ఏకంగా నాలుగు అడుగుల పామును మింగేసింది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో డాక్టర్లు ఆపరేషన్ చేసి పామును తీసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే రష్యాలోని డజెస్థాన్ ప్రాంతంలో లెవాషీ గ్రామంలో ఒక యువతి రోజూలానే రాత్రి సమయంలో నిద్రపోయింది.

యువతి తెల్లవారుజామున లేచే సమయానికి యువతికి కడుపు భాగమంతా ఏదో జీవి తిరుగుతున్నట్టు అనిపించింది.కడుపంతా తిప్పుతున్నట్టు అనిపించడంతో యువతి ఆస్పత్రికి వెళ్లి డాక్టర్లకు తన సమస్యను వెల్లడించింది.

పరీక్షలు చేసిన వైద్యులు పాము ఆకారంలోని జీవి ఆమె కడుపులో ఉన్నట్లు గుర్తించారు.

ఒక పైపును నోట్లోకి పంపి శస్త్రచికిత్స ద్వారా నోట్లో ఉన్న జీవిని బయటకు తీశారు.

లోపలికి పంపిన పైపుతో నాలుగు అడుగుల పాము బయటకు రావడంతో అక్కడ ఉన్న నర్సు తీవ్ర భయాందోళనకు గురైంది.పాము బయటకు వచ్చినప్పటికీ ఆ పాము బ్రతికే ఉందా…? చనిపోయిందా…? అనే విషయాలను మాత్రం డాక్టర్లు వెల్లడించలేదు.ఆస్పత్రి సిబ్బంది తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

నాలుగు అడుగుల పామును మింగిన యువతి గురించి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే నాలుగు అడుగుల పొడవైన పాము యువతి కడుపులోకి ఏ విధంగా వెళ్లిందనే విషయం మాత్రం తెలియల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube