ఆ పది సెకండ్ల వీడియోకి రూ. 48 కోట్లు.. ఎందుకంటే..?!

సాధారణంగా ఎవరైనా ప్రముఖు చిత్రకారులు వేసిన పెయింటింగ్స్ లక్షల ఖరీదుతో కొనుగోలు చేస్తూ ఉంటారు కొందరు.ఒకవేళ ఆ పెయింటింగ్ పురాతన కాలానికి చెందిన అయితే అది ఏకంగా కోట్లల్లో ధర ఉంటుంది.

 48 Crores For That 10 Seconds Video Of Trump , 10-second Video, Clip ,sold, $6.6-TeluguStop.com

అలాగే ఆ పెయింటింగ్స్ ను ఎక్సబిషన్ గా నిర్వహించి మరి విక్రయాలు జరుపుతూ ఉంటారు.ఇది ఇలా ఉండగా.

తాజాగా ఒక వీడియో క్లిప్ మాత్రం ప్రజలందరూ కూడా ఉచితంగానే చూడవచ్చు కానీ.అలాంటి వీడియో క్లిప్ ను ఒక వ్యక్తి ఏకంగా 48 కోట్లకు రూపాయలకు కొనుగోలు చేశాడు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.మియామీ కి చెందిన ఆర్ట్ క‌లెక్ట‌ర్ పాబ్లో రోడ్రిగ‌జ్ ఫ్రెయిలె గత సంవత్సరం 67 డాలర్లకు (దాదాపుగా రూ.48.3 కోట్లు)  పది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను కొనుగోలు చేశాడు.ఆ వీడియో క్లిప్ ను గత వారమే 6.6 మిలియన్ డాలర్లకు విక్రయించాడు.అంతలా ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా.? డోనాల్డ్ ట్రంప్ కు చెందిన ఒక భారీ విగ్రహం పక్కన పడి ఉంటుంది.కానీ, దాన్ని పట్టించుకోకుండా అక్కడి ప్రజలు వెళ్లిపోతు ఉంటారు.

ఈ తతంగం మొత్తం గ్రాఫిక్స్‌ తో క్రియేట్ చేసినట్లు స్పష్టంగా కనబడుతోంది.వాస్తవానికి ఇలాంటి వీడియోలను నాన్ ఫంజిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్‌టీ)  డిజిటల్ ఆస్తులుగా పిలుస్తూ ఉంటారు.

వీటిని బిట్ కాయిన్ల లాగా డాలర్లతో కొనుగోలు చేసుకోవచ్చు.ఇలా ఉండగా ఆ వ్యక్తి ఎందుకు అంత ధర పెట్టి కొనుగోలు చేశాడు.

, మరి ఇంకొకరికి అంత పెద్ద మొత్తంలో అమ్మకం జరిపాడో అన్నది ఇంతవరకు అర్థం కావటం లేదు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ కాస్ట్లీ వీడియోను వీక్షించి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube