నా భర్తకు 47 మంది పిల్లలు... కలిసి ఉండాలా? విడి పోవాలా? అంటూ భార్య ఆన్‌ లైన్‌ పోల్‌  

47 Children Of Donor Facing Problem From Wife- Donor,telugu Viral News,viral In Social Medea,wife On Line Polling,వీర్యదానం వల్ల పుట్టిన పిల్లలు

భార్య, భర్తల మద్య విచిత్రమైన సంఘటనల వల్ల వివాదాలు తలెత్తుతాయి. చిన్న విషయాలకు కూడా భార్య భర్తలు విడిపోయేందుకు సిద్దం అవుతారు. ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి పాశ్చాత్య దేశాల్లో ఈ వివాడాకులు అనేవి చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం..

నా భర్తకు 47 మంది పిల్లలు... కలిసి ఉండాలా? విడి పోవాలా? అంటూ భార్య ఆన్‌ లైన్‌ పోల్‌-47 Children Of Sperm Donor Facing Problem From Wife

తాజాగా ఇలాంటి విచిత్రమైన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.

తన భర్త నుండి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటీ అంటూ ఆమె సోషల్‌ మీడియాలో తన స్నేహితులను మరియు ఇతరులను అడిగింది. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం విడాకులు వద్దని చెప్పడం జరిగింది. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేనప్పటికి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఒక భార్య సోషల్‌ మీడియాలో తన భర్తకు 47 మంది పిల్లలు ఉన్నారు, వారు భవిష్యత్తులో ఎప్పుడైనా మీరే నా తండ్రి అంటూ వస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం అవ్వడం లేదు. నా భర్త వీర్య దానం వల్ల పుట్టిన పిల్లలు నాన్న అంటూ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటీ అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ప్రేమించుకునే సమయంలో తాను వీర్య దానం చేస్తున్నాను అని చెప్పాడు. కాని ఇద్దరు ముగ్గురికి వీర్య దానం చేసి ఉంటాడని నేను అనుకున్నాను.

కాని తాజాగా 47 మందికి తాను వీర్య దానం చేశానంటూ చెప్పాడు. అప్పటి నుండి కూడా నేను ఆయనతో కలిసి ఉండలేక పోతున్నాను. భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందా అనే భయం నన్ను వెంటాడుతుంది.

అప్పుడు మీరు ఎంత మందికి వీర్య దానం చేశారు అని నేను అడగక పోవడం తప్పే. అయితే ఆ తప్పును ఇప్పుడు నేను సరిదిద్దుకోలేను.

పెళ్లి తర్వాత వీర్యదానంను నేను వద్దంటే ఆపేశాడు. అయినా కూడా అప్పుడు వీర్యదానం ద్వారా పుట్టిన పిల్లలు మీరే మా నాన్న అంటూ వస్తే నా పరిస్థితి, నా పాప పరిస్థితి ఏంటీ అంటూ భార్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆయనతో కలిసి ఉండి భయపడుతూ బతకడం కంటే, విడిపోయి సంతోషంగా ఉండటం బెటర్‌ అని నేను అనుకుంటున్నాను అంటూ పోస్ట్‌ చేసింది..

అయితే ఆమె పోస్ట్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

మీ భర్త తప్పు చేయలేదు, అలా వీర్యదానం వల్ల పుట్టిన పిల్లలు మీరు నా తండ్రి అంటూ వచ్చిన దాఖలాలు లేవు. అందుకే మీరు ఎలాంటి భయం లేకుండా మీ భర్తతో సంతోష జీవితం గడపవచ్చు. ఒక వేళ వచ్చినా కూడా వారికి చట్టపరంగా ఎలాంటి అవకాశం ఉండదని కొందరు ఆమెకు భరోసా ఇస్తున్నారు.

మొత్తానికి ఆమె నిర్ణయాన్ని మార్చేందుకు పలువురు పలు రకాలుగా సలహాలు ఇచ్చారు. మరి ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.