అందుబాటులో 44 కోట్ల వ్యాక్సిన్ డోసులు..!

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.

 44 Crore Vaccine Doses Ordered By Centre Corona Vaccination , 44 Crore,  Centre,-TeluguStop.com

ఇక ఆగష్టు నుండి 44 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్ లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది.ఆయాన్ సంస్థలకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినట్టు చెప్పింది.19 కోట్ల కొవాగ్జిన్, 25 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను ఆర్డర్ పెట్టారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.భారత్ బయోటెక్ నుండి కొవాగ్జిన్ ఉత్పత్తి కాగా సీరం ఇన్ స్టిట్యూట్ నుండి కొవిషీల్డ్ వచ్చింది.

ఇక ఇదే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా వర్క్ చేస్తున్న బయోలాజికల్ ఇ నుండి కూడా 30 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను బుక్ చేసినట్టు తెలుస్తుంది.అయితే ఈ టీకాకు అనుమతులు రావాల్సి ఉంది.

వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏర్పడ్డ గందరగోళం పై కేంద్రం జాగ్రత్త పడ్డది.అర్హులందరికి ఉచితంగా టీకాలు అందచేసేలా ప్రధాని మోడీ ప్రకటించారు.

వీలైనంత త్వరగా అందరికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా ప్రభుత్వాలు ప్లాన్ చేస్తున్నాయి.ఇందులో భాగంగానే భారీ మొత్తంగా టీకా డోసుల కోసం ఆర్డర్ చేసినట్టు తెలుస్తుంది.

 అనుకున్నట్టుగా 44 కోట్ల డోసుల టీకా వస్తే దేశంలో సగానికి పైగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube