ఇది మామూలు లెటర్ కాదురా బుజ్జి.. 434 మీటర్ల లెటర్

బ్రదర్స్, సిస్టర్స్ మధ్య ప్రేమ చాలా గాఢంగా ఉంటుంది.ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమగా ఉంటారు.

 434 Meters Letter By A Sister To Her Brother Details, 434 Meters Letter, Very Bi-TeluguStop.com

కొట్టుకుంటూ, తిట్టుకుంటూనే ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు.అయితే ఇప్పుడు ఓ అక్క చేసిన పని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తిది కేరళలోని ఇడుక్కి.ఇంజినీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్నాడు.

అతడి అక్క పేరు కృష్ణ ప్రియ. ఆమే ఇంజినీర్ గా పనిచేస్తోంది.

వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా.అక్కా తమ్ముళ్లు రోజూ మాట్లాడుకుంటారు.

తమ్ముడు అంటే ఆ అక్కను ఎంతో ప్రేమ.అయితే ఒక రోజు మాత్రం కృష్ణ ప్రియకు చాలా పని ఉండటంతో తమ్ముడికి కాల్ చేయలేదు.

పని ఒత్తిడి వల్ల ఆ విషయం కూడా తను పూర్తిగా మర్చిపోయింది.పనిలో చాలా బిజీ అయిపోయింది.

కానీ ఆ మే 24వ తేదీనే కృష్ణ ప్రసాద్ పుట్టిన రోజు. ఎప్పుడూ కాల్ చేసే అక్క తన పుట్టిన రోజున కాల్ చేయకుండా ఉంటుందా అని అనుకున్నాడు కృష్ణ ప్రసాద్.

ప్రతి రోజులా కాకుండా మరింత ఉత్సాహంగా తన అక్క నుండి వచ్చే కాల్ కోసం ఎదురుచూశాడు.కానీ కృష్ణ ప్రియ నుండి ఎలాంటి కాల్ రాలేదు.ఉదయం లేచినప్పటి నుండి పదే పదే ఫోన్ వైపే చూస్తూ వెయిట్ చేశాడు.కానీ అక్క నుండి కాల్ లేదు, మెసేజీ లేదు.

ఉదయం దాటింది, పగలు అయిపోయింది.రాత్రి అయినా అక్క నుండి కాల్ రాలేదు.

దీంతో కృష్ణ ప్రసాద్ పట్టరాని కోపం వచ్చింది.

Telugu Meter Letter, Meterletter, Brothersister, Brother, Kerala, Krishna Prasad

తర్వాత తమ్ముడి పుట్టినరోజని గుర్తుకు రావడంతో తమ్ముడికి ఫోన్ చేసింది.కానీ కృష్ణ ప్రసాద్ తనతో ఫోన్ మాట్లాడలేదు.వాట్సాప్లో నంబర్ బ్లాక్ చేశాడు.

దీంతో ఏం చేయాలో తెలియని ప్రియ… లేఖ రాయాలని నిర్ణయించుకుంది.ఒక పేపర్ లో తన భావాలను, తమ్ముడిపై తనకున్న ప్రేమను వివరించడం సాధ్యం కాలేదు.

దీంతో 14 బిల్లింగ్ రోల్స్ లో 12 గంటలు కష్ట పడి లేఖ రాసింది.దాని పొడవు 434 మీటర్లు, 5 కేజీల బరువు ఉంది.

అంత పెద్ద లేఖ రాసిన ప్రియ కష్టం ఫలితాన్నిచ్చింది.లేఖ చదివిన తమ్ముడు అక్కను అర్థం చేసుకుని ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube