ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.ఢిల్లీలోని ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండీలోని ఓ బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగి 43 మంది సజీవ దహనం అయ్యారు.

 43 Persons Killed In Delhi Fire Accident-TeluguStop.com

కాగా మరో 20 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ప్రమాదంలో 64 మందిని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ భవనంలో స్కూల్ బ్యాగులు, బాటిళ్లు తయారు చేసే కుటీర పరిశ్రమ ఉండటంతో ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.కార్మికులు నిద్రుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతోనే భారీ ప్రాణ నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు.

భవనంలో మరో 20 మంది చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతులంతా కర్మగారంలో పనిచేసే వారిగా పోలీసులు గుర్తించారు.

కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన స్థలం చాలా ఇరుకుగా ఉండటంతో సహాయకచర్యలు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని వారు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube