జైల్లో ఏకంగా 41 మంది ఖైదీలు మృతి..!!

ఇండోనేషియా దేశం లో బాంటెన్ ప్రావిన్స్ లో ఉన్న జైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఏకంగా 41 మంది ఖైదీలు మరణించారు.ఇదే అగ్ని ప్రమాదంలో 81 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడటం జరిగింది.

 41 Prisoners Killed In Jail Indonesia, Jail Prisioners, Fire Accident , 41 Pri-TeluguStop.com

దీంతో వెంటనే జైలు సిబ్బంది.గాయపడిన ఖైదీలను ఆసుపత్రికి తరలించారు.

అయితే మరణించిన ఖైదీలలో చాలావరకు డ్రగ్స్ కేసులో దొరికిన వారు ఎక్కువ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జైలులో దాదాపు 2000 మంది ఖైదీలు ఉన్నారు.

అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై కారణాలు ఇంకా బయటికి రాలేదు.అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో పాటు ఇండోనేషియా దేశ సైనికులు కూడా రంగంలోకి దిగి ఖైదీల ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకుండా చాలా వరకు చర్యలు తీసుకోవడం జరిగింది.

జైలు లో భారీగా ఎగసిపడిన మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో చాలావరకుపెను ప్రమాదం లేకుండాపరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.ఏకంగా 41 మంది ఖైదీలు అగ్నిప్రమాదంలో చనిపోవడంతో ఈ వార్త అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube