మృతుని కుటుంభానికి 4000 ఆర్థిక సహాయం అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంనకు చెందిన అగుల్ల రవి ఇటీవల ప్రమాదవశాత్తు నిజామాబాద్ జిల్లాలో చెరువులో పడి చనిపోయాడు.

మృతునికి కుటుబసభ్యులు భార్య లావణ్య, కుమారులు సిద్దార్థ్ (11) సంతోష్(9) తల్లిదండ్రులు లక్ష్మి, అడివయ్య ఉన్నారు.

ఇట్టి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను వాట్సప్ గ్రూప్ లో పెట్టగా మానవతా దృక్పథంతో ఆలోచించి స్పందించి ఆర్థిక సహాయం చేయాలని కోరగా తన వాట్సప్ గ్రూప్ మిత్రులు స్పందించి నాలుగువేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపించగా అట్టి డబ్బులను రవి దశదినకర్మ రోజున మృతుడి కుటుంబానికి నగదు అందజేయడం జరిగింది.గుడిసె లో నివాసముంటున్న వీరికి గృహ లక్ష్మి పథకం కింద లబ్ధి చేకూర్చలనీ బాలరాజు యాదవ్ జిల్లా కలెక్టర్ ను, ఎంపిడిఓ చిరంజీవి నీ కోరారు.

మానవత్వంతో స్పందించి అట్టి కుటుంబానికి బాసటగా నిలిచిన తన వాట్సప్ గ్రూప్ మిత్రులకు బాలరాజు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.ఇంకా ఎవరైనా అట్టి కుటుంబాన్ని ఆదుకోవాలనుకునే వారు 9000996122(శేఖర్) కు ఫోన్ పే చేయాలని కోరారు.

ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట అగుళ్ల శేఖర్ తదితరులున్నారు.

Advertisement
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 23 ఫిర్యాదులు స్వీకరణ. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Latest Rajanna Sircilla News