400 GB హై స్పీడ్‌ ఇంటర్నెట్ .. మరీ ఇంత చవక!

నెలకి 303 రూపాయల ఖర్చుతో జియో 28 GB డేటాట ఇస్తోంది (రోజుకి 1GB).సరిగ్గా ఇదే ప్లాన్ ని 345 రూపాయలకి వొడాఫోన్, 349 రూపాయలకి ఏయిర్ టేల్ అందిస్తోంది.

 400 Gb – 40 Mbps Speed – Very Cheap Price-TeluguStop.com

ఈ మూడు ప్లాన్స్ లో కూడా రోజుకి 1GB కన్నా ఎక్కువ హై స్పీడ్/4G ఇంటర్నెట్ రాదు.కాని అన్ లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

ఒకవేళ, కేవలం డేటా మాత్రమే మీ ప్రిఫరెన్స్ అయితే, ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది .చెప్తాం చూడండి .

ప్రముఖ బ్రాడ్ బాండ్ హాత్ వే (Hathway) ఒక సూపర్ ప్లాన్ ని ప్రవేశపెట్టింది.నెం.1 బ్రాడ్ బాండ్ అయిన ACT ని తలదన్నేలా ఉంది ఈ ప్లాన్.మరి వివరాల్లోకి వెళితే .అన్ని కలుపుకోని (సర్వీస్ ట్యాక్స్) నెలకి 745 రూపాయలు.నెలకి 200 GB వస్తుంది.

స్పీడ్ 40 MBPS.ఇలా చూస్తే సింపుల్ గానే ఉంది కదూ ప్లాన్.అదే మూడు నెలలకి కలిపి తీసుకున్నారనుకోండి .మీకు పండగే.

మూడు నెలలకి కలిపి ఒకేసారి 2,235 రూపాయలు చెల్లించారనుకోండి, నెలకి 400 GB డేటా, ఏకంగా 40 MBPS స్పీడ్ తో మీ సొంతం అవుతుంది.400 GB ఒకే నెలలో వాడినా, ఆ తరువాత 2 MBPS స్పీడ్ తో అన్ లిమిటెడ్ వస్తుంది.వైఫై రూటర్ వాళ్ళే ఉచితంగా ఇస్తారు.ఎలాంటి ఇంస్టాలేషన్ చార్జీలు కాని, అదనపు ఖర్చు కాని ఉండదు.పైగా, షిఫ్టింగ్ చార్జీలు కూడా ఉండవు.రోజుకి 1GB డేటా సరిపోదు అని అనుకునేవారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్.

ఆన్ లైన్ లో సినిమాలు చూసేవారు, వీడియో కాల్స్ ఎక్కువ చేసేవారు, యూట్యూబ్ ఎక్కువగా వాడేవారు, ఆఫీస్, స్కూలు వారికి సరిపోయే ప్లాన్.

అదే నెలకి మరో 20 రూపాయలు ఎక్కువ ఖర్చుపెడితే ఎలాంటి లిమిట్ లేని 10 MBPS అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ కూడా ఉంది.

మీ అవసరాన్ని బట్టి చూసుకోండి.లేదు, నెట్ తో అంత అవసరం లేదు, రోజుకి ఒక జీబి చాలు అనుకుంటే లైట్ తీస్కోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube