40 సంవత్సరాలకు ఒకసారి తెరిచే దేవాలయం.. ఎక్కడుందో తెలుసా?

మనదేశంలో దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.అతి పురాతన ఆలయాలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

 40 Years Once Open In Athi Varadharaja Swamy Temple 40 Years Temple, Tamilnadu,-TeluguStop.com

తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి పురాతన ఆలయాలకు ఎంతో ప్రసిద్ధి చెందినది.వందల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇక్కడ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

ఇక్కడ దేవాలయాలను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.అయితే తమిళనాడులో ఒక ఆలయం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆ గుడి ప్రతి 40 సంవత్సరాలకొకసారి మాత్రమే తెరుస్తారు.అలా ఎందుకు చేస్తారో, అందుకు గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

తమిళనాడులోని, కాంచీపురం సమీపంలో అత్తి వరద రాజ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైన ఆలయం.ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి 40 సంవత్సరాల ఓకసారి మాత్రమే ఈ దేవాలయం తెరుస్తారు.

అది కూడా కేవలం 48 రోజుల పాటు మాత్రమే, దేవుడి దర్శనానికి అనుమతిస్తారు.ఈ 48 రోజులు దేవుడి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది.1979 తెరిచిన ఈ ఆలయం మళ్లీ ఈ ఏడాది జూన్ 1న తెరచి 48 రోజులపాటు దేవుని దర్శనం కల్పించారు.ఈ నలభై ఎనిమిది రోజులలో అత్తి వరదరాజ స్వామి 38 రోజులపాటు శయన స్థితిలో భక్తులకు దర్శనమిస్తాడు.మిగతా పది రోజులు నిలబడి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.

16వ శతాబ్దంలో కాంచీపురం పై జరిగిన దండయాత్రలో భాగంగా ఈ దేవాలయం దోపిడీకి గురైందని, ఆ సమయంలో లో అత్తి వరదరాజ స్వామి విగ్రహాన్ని వెండి పెట్టెలో భద్రపరిచి ఆ గుడి కోనేరులో పడేసినట్టు అక్కడి ప్రజలు చెబుతారు.అయితే ఆ విగ్రహం కోనేరులో ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉండటం వల్ల తిరిగి ఆ విగ్రహాన్ని దేవాలయంలో ప్రతిష్టి పూజలు నిర్వహిస్తున్నారు.అప్పటి నుంచి ఈ దేవాలయం ప్రతి 48 సంవత్సరాలకు 48 రోజులపాటు తెరచి ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube