కరోనా వైరస్ కారణంగా నందమూరి రేవతి మృతి... దాంతో... 

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎంతగానో కలకలం సృష్టిస్తుంది.దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

 40 Years Old Pharmacist Nandamuri Revathi Dead For Corona In Kakinada-TeluguStop.com

అంతేగాక దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆక్సిజన్ కొరత సమస్య ఎక్కువ అవుతుండడంతో రోజూ వందల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్నారు.తాజాగా కరోనా వైరస్ విపత్కర పరిస్థితులలో కూడా వైద్య సేవలు అందించిన వైద్యురాలు కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పరిసర ప్రాంతంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే 40 సంవత్సరాలు కలిగినటువంటి “నందమూరి రేవతి” అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ పరిసర ప్రాంతంలో నివాసముంటోంది.అయితే ఈమె కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాసుపత్రిలో ఫార్మసిస్ట్ గా పనిచేస్తోంది.

 40 Years Old Pharmacist Nandamuri Revathi Dead For Corona In Kakinada-కరోనా వైరస్ కారణంగా నందమూరి రేవతి మృతి… దాంతో… -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇటీవలే నందమూరి రేవతికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో స్థానికంగా ఉన్న క్వారెంటైన్ భవనంలోకి వెళ్లి చికిత్సలు తీసుకుంటోంది.కానీ అనుకోకుండా వైరస్ తీవ్రత ఎక్కువవడంతో ఈ రోజున రేవతి కన్ను మూసింది.

దీంతో ఒక్కసారిగా స్థానికంగా ఉంటున్న ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.అయితే ఇక్కడ మరో విషాదకరమైన సంఘటన ఏమిటంటే గతంలో నందమూరి రేవతి తండ్రి కూడా ఈ కరోనా వైరస్ సోకి మృతి చెందాడు.

దీంతో నందమూరి రేవతి కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

దీంతో ఇప్పటికే ప్రభుత్వ అధికారులు ఈ కరోనా వైరస్ మహమ్మారి అరికట్టేందుకు పలు సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తున్నారు.దీంతో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలకి అనుమతులు ఉంటాయని ఆ తర్వాత అత్యవసర సమయంలో తప్ప అనవసరంగా రోడ్లపైకి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

.

#40Years #Corona Death #Andhra Pradesh #Lock Down #Pharmacist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు