40 ఏండ్ల టీడీపీ ప్ర‌స్థానం... రిపీట్ ?

1982 మార్చి 29న కొత్త పార్టీ పెడుతున్న‌ట్లు సీనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌క‌టించారు.చైత‌న్య ర‌థంపై ప్ర‌చారాలు చేప‌ట్టి .

 40 Years Of Tdp Rule  Repeat , Tdp Rule  , Repeat , Congress Party , Tdp 40 Yea-TeluguStop.com

తెలుగుదేశం పిలుస్తోంది.రా.క‌ద‌లి రా.నినాదంతో ముందుకు సాగారు.ఆ త‌రువాతి కాలంలో భార‌త రాజ‌కీయాల్లో ఎన్నో ర‌థాల‌కు ఈ చైత‌న్య ర‌థ‌మే స్ఫూర్తినిచ్చింది.మొత్తంగా ఆత్మ గౌర‌వ నినాదంతో టీడీపీ ఆవిర్భ‌వించింది.వెండితెర వేల్పుగా ప్ర‌జ‌ల ఆదరాభిమానాలు పొందిన ఎన్టీఆర్ పార్టీ పెట్టి స‌క్సెస్ అయ్యారు.1983 జ‌న‌వ‌రి 7న జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ 199 సీట్లు గెలుచుకుంది.అప్ప‌టికే 97 ఏండ్ల సుధీర్ఘ చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ టీడీపీ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది.ఈ అద్భుత విజ‌యం ఆయ‌న రాజ‌కీయ జీవితంలో అత్యున్న‌త ఘట్టం.

అధికారం చేప‌ట్టిన త‌రువాత అనేక‌ విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ప్ర‌స్తుతం టీడీపీది 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.

నాడు 40మందితో టీడీపీ ప్ర‌స్థానం మొద‌లై అన‌తికాలంలో ప్ర‌భంజ‌నం సృష్టించింది.వెండితెర నుంచి రాజ‌కీయాల‌వైపు ఎన్టీఆర్ మ‌ళ్లారు.40 ఏండ్ల సుధీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర‌లో మొద‌టి 14 ఏండ్లు టీడీపీ కి ప్రెసిడెంట్‌గా ఎన్టీఆర్ ప‌ని చేశారు.ఎన్టీఆర్ శకం ఒక అద్భుత‌మ‌నే చెప్పాలి.

ఆయ‌న 8ఏండ్ల పాటు సీఎంగా ప‌నిచేశారు.ఇక ఎన్టీఆర్ అనంత‌రం చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో టీడీపీ గ‌త 26 ఏండ్లుగా సాగుతోంది.

ఇందులో 14 ఏండ్ల పాటు బాబు సీఎంగా ప‌ని చేశారు.అయితే సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌న గ్లామ‌ర్‌తో పార్టీని న‌డిపిస్తే.

బాబు మాత్రం త‌న పొలిటిక‌ల్ గ్రామ‌ర్‌తో టీడీపీని ముందుకు తీసుకొచ్చారు.ఎన్టీఆర్ అభిమానులంతా టీడీపీలోనే ఉండేలా చూసుకున్నారు.

Telugu Chandrababu, Congress, Repeat, Sr Ntr, Tdp-Telugu Political News

మొత్తంగా ఎన్టీఆర్ ఒక‌సారి ఓడితే .చంద్ర‌బాబు మూడు సార్లు ఓడారు.2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది.ఇక రాబోయే 2024 ఎన్నిక‌లు టీడీపీకి ముఖ్యం.దానికి రెండేండ్ల ముందే.40వ మైలురాయిని టీడీపీ దాటుతుంది.ఈ నేప‌థ్యంలో టీడీపీ రాజ‌కీయ మూల‌ధ‌నాన్ని, ఇంధ‌నాన్ని ఉప‌యోగించుకుని రెట్టించిన ఉత్సాహంతో 2024లో విజ‌య‌ఢంకా మోగించాల‌ని టీడీపీ అధినాయ‌క‌త్వం భావిస్తోంద‌ట‌.ఇందుకు న‌ల‌భై ఏండ్ల టీడీపీ ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని చూస్తోంద‌ట‌.

దీనికి సంబంధించిన లోగోను కూడా టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా ఆవిష్క‌రించారు.ఎన్టీఆర్‌ది ఒక చ‌రిత్ర‌.

టీడీపీది అదే చ‌రిత్ర‌… ఆయ‌న పేద‌ల కోసం పార్టీని పెట్టారు.టీడీపీకి బీసీలు వెన్నుద‌న్ను అంటు చెప్పుకొచ్చారు.

పార్టీ బ‌లోపేతానికి క్యాడ‌ర్ పున‌రంకితం కావాల‌ని పిలుపునిచ్చారు.మొత్తంగా స‌రైన స‌మ‌యానికి టీడీపీ ప్ర‌స్థానం ఈవెంట్ రావ‌డం క‌లిసొచ్చే అంశం.

దీంతో 1983 నాటి హిస్ట‌రీ రిపీట్ చేయాల‌ని భావిస్తోంద‌ట‌.ఇది నెర‌వేరుతుందా ? అంటే వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube