40 వేల మందికి వ్యాక్సిన్.. సక్సెస్ అయిన హైదరాబాద్ వ్యాక్సిన్ డ్రైవ్..!

తెలంగాణా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యింది.లేటెస్ట్ గా హైదరాబాద్ లో జరిగిన మెగా వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అయ్యింది.

 40 Thousand People Vaccinated In Mega Vaccine Drive Hyderabad-TeluguStop.com

ఆదివారం ఒక్కరోజే 40 వేల మందికి వ్యాక్సిన్ వేసినట్టు వెల్లడైంది.మాదాపూర్ లో హైటెక్స్ లో ఆదివారం నిర్వహించిన అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ లో 40 వేల మందికి టీకా అందించారు.

గంటల తరబడి వెయిట్ చేయడం.క్యూలో నిలబడటం లాంటివి లేకుండా వచ్చిన వారికి వచ్చినట్టుగా వ్యాక్సిన్ వేసి పంపించారు.

 40 Thousand People Vaccinated In Mega Vaccine Drive Hyderabad-40 వేల మందికి వ్యాక్సిన్.. సక్సెస్ అయిన హైదరాబాద్ వ్యాక్సిన్ డ్రైవ్..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్, సెక్యురిటీ కౌన్సిల్, మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో 700 మంది నర్సులు, 400 మంది వాలంటీర్లు, 300 మంది వైద్య సిబ్బంది అంతా పాల్గొని గంటకు 3వేల మందికి వ్యాక్సిన్ వేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు.

ముందుగానే ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి క్యూ.ఆర్ కోడ్ కేటాయించారు.

వ్యాక్సిన్ కోసం అక్కడకి రాగానే క్యూ.ఆర్ కోడ్ స్కాన్ చేసి లోపలకు పంపించడం.

అలా వెళ్లగానే నర్సులు వ్యాక్సిన్ వేసి పంపించడం జరిగింది.మొత్తం 40 వేల మందికి టీకాలు వేసినట్టు తెలుస్తుంది.

మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కు సపోర్ట్ చేసిన ప్రజలకు.ఈ కార్యక్రమలో పాల్గొన్న సిబ్బందికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

#Vaccinated #Vaccine Drive #Telagana #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు