వామ్మో.. 24 గంటల్లో 40 వేల పాజిటివ్ కేసులు..!

కరోనా వైరస్.ప్రపంచ దేశాలను ఎలా వణికిస్తోంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 40 Positive Corona Cases In India, Coronavirus, India, Corona Cases In India, Co-TeluguStop.com

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కోటి 46 లక్షలమందికిపైగా వ్యాపించగా 87 లక్షలమందికిపైగా కరోనా నుండి కోలుకున్నారు.ఇంకా 6 లక్షలమంది కరోనా కు బలయ్యారు.

ఇది ఇలా ఉండగా భారత్ లోను కరోనా కేసుల విజృంభణ దారుణంగా పెరుగుతుంది.

కేంద్రం కీలక చర్యలను తీసుకుంటుంది.

పరీక్షల నిర్వహణ సంఖ్య పెద్ద ఎత్తున చేస్తుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,4,40,908 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

అయితే గడిచిన 24 గంటల్లో రెండు లక్షల 56 వేల శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 40, 421 పాజిటివ్ కేసులు వచ్చాయి.ఇంకా నిన్న వైరస్ భారిన పడి 681 మంది మృతి చెందారు.

నిన్నటి పాజిటివ్ కేసులతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,18,043కి చేరింది.ఇంకా మృతుల సంఖ్య 27,497కి చేరింది.కాగా ఇప్పటి వరకు 7 లక్షల మందికిపైగా కరోనా బాధితులు కోలుకున్నారు.ఏది ఏమైనా భారత్ లో రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ప్రజలు బయటకు వచ్చేసమయంలో మాస్కు, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలి.అప్పుడే కరోనా బారి నుండి తప్పించుకోగలరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube