మళ్లీ చైనా లో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు

ఒకపక్క చైనా లో మొదలైన ఈ కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే అక్కడ పలువురిని పొట్టన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.ప్రపంచానికి తెలిసిన ప్రకారం అక్కడ 3 వేలమందికి పైగా మృతి చెందగా, ప్రపంచానికి తెలియని లెక్కల ప్రకారం అక్కడ దాదాపు 40 వేలకు పైబడే జనాలు మృతి చెందినట్లు వార్తలు వెల్లడవుతున్నాయి.

 40 Percent Increased In Filing New Corona Cases In China, Corona, China, Coronav-TeluguStop.com

అయితే ఇటీవలే ఈ కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో అక్కడి ప్రభుత్వం వూహన్ నగరంలో విధించిన 76 రోజుల లాక్ డౌన్ ను కూడా ఎత్తివేసింది.అయితే అంతా తగ్గుముఖం పట్టింది ఇక కరోనా తో భయం లేదు అని అనుకుంటున్న తరుణంలో అక్కడ మరోసారి కేసులు పెరుగుతుండడం తో అక్కడి వారు మరింత ఆందోళన చెందుతున్నారు.

సోమవారం కొత్తగా 99 మందికి కరోనా సోకగా,బుధవారం 46 మందికి కొత్తగా ఈ కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది.దీనితో అక్కడ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తం అవుతుంది.

అయితే దాదాపు ఈ కేసులు అన్ని కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం.చైనాలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసులు 82295.
వాటిలో రికవరీ అయిన కేసులు… 77816.చనిపోయిన వారి సంఖ్య 3342.ఐతే లాక్‌డౌన్ ఎత్తివేసి వారమైంది.లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కొత్తగా 384 కేసులు నమోదయ్యాయి.

ఇవాళ ఇప్పటివరకూ మరో 46 కేసులు నమోదయ్యాయి.ఫలితంగా కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 430గా ఉంది.

అందువల్ల ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నవారి సంఖ్య చైనాలో 1137గా ఉంది.ఈ వారమంతా లాక్‌డౌన్ నుంచి బయటికి వచ్చిన వారు… తిరుగుతూనే ఉన్నారు.

కొంత వరకు స్వయంగా సోషల్ డిస్టాన్స్ పాటిస్తున్నప్పటికీ మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటం చైనాతోపాటూ ప్రపంచ దేశాలను కూడా ఆందోళనకు గురి చేస్తుంది.ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే చైనాలో మార్చి 25 నాటికి 81285 కేసులున్నాయి.

ఏప్రిల్ 8 నాటికి అంటే లాక్‌డౌన్ ఎత్తేసే నాటికి 81865 కేసులున్నాయి.అంటే 14 రోజుల గ్యాప్‌లో కొత్తగా నమోదైన కేసులు 580 కాగా,ఈ లాక్‌డౌన్ ఎత్తేశాక వారం రోజుల్లో అక్కడ నమోదైన కేసులు 430గా ఉన్నాయి.అంటే… లాక్‌డౌన్ ఎత్తేశాక… చైనాలో కరోనా కేసుల జోరు 40 శాతం పెరిగినట్లే.

Telugu Corona China, China, Corona, Coronavirus, Lockdown-

చైనా విదేశీ విమానాల్లో తమ దేశానికి వస్తున్న వారి వల్లే ఈ కొత్త కేసులు నమోదవుతున్నాయని చెబుతోంది.ఏది ఏమైనా చైనా జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా 2 అక్కడ వ్యాపించే ప్రమాదం ఉన్నట్లే కనిపిస్తుంది.ఈ కరోనా మహమ్మారి కి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే.

అగ్రరాజ్యం సైతం ఈ కరోనా మహమ్మారి మరణాలతో మరోసారి అగ్రరాజ్యం అనిపించుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube